Holiday Blues : పండుగ వేళ దిగులెందుకు..? హాలిడే బ్లూస్ నుంచి బయటపడండి ఇలా..!

సాక్షి లైఫ్ : పండుగలు వచ్చినప్పుడు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అందరినీ సంతోష పెట్టాలనే తపన, పనుల ఒత్తిడి వల్ల కలిగే అలసట మనల్ని మానసిక ఇబ్బందులకు గురిచేస్తుంది. దీనినే వైద్య భాషలో 'హాలిడే బ్లూస్' (Holiday Blues) అని కూడా అంటారు. సాధారణంగా పండుగ సీజన్లలో మనపై మనకే తెలియని సామాజిక ఒత్తిడి ఉంటుంది. అందరూ నవ్వుతూ ఉన్నప్పుడు మనం కూడా అలాగే ఉండాలనే ప్రయత్నం మనసును మరింత అలసిపోయేలా చేస్తుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నిపుణులు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?  

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

 

హాలిడే బ్లూస్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే..?

నిరంతరం అలసటగా అనిపించడం.

చిన్న విషయాలకే చిరాకు లేదా కోపం రావడం.

పండుగ వేడుకల్లో పాల్గొనాలనే ఆసక్తి తగ్గడం.

ఆకలి లేదా నిద్రలో మార్పులు రావడం.

ఈ స్థితిని అధిగమించే మార్గాలు.. 

అంచనాలను తగ్గించుకోవడం మంచిది.. పండుగ అంటే అన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉండాలని రూల్ లేదు. చిన్న చిన్న లోపాలను వదిలేయండి. మీ సంతోషానికే ప్రాధాన్యత ఇవ్వండి.

సోషల్ మీడియాకు దూరంగా ఉండడం బెటర్.. ఇతరులు పండుగలకు సంబంధించిన పోస్ట్ చేసే ఫోటోలను,వీడియోలను చూసి, వారి జీవితాలు చాలా బాగున్నాయని మీతో పోల్చుకోవద్దు. ఫోన్ పక్కన పెట్టి దగ్గరలో ఉన్నవ్యక్తులతో సమయం గడపండి.

మితంగా ఆహారం.. తగినంత నిద్ర ఖచ్చితంగా ఉండాలి.. పండుగ కదా అని అతిగా తిన్నా లేదా నిద్ర తగ్గించినా మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. పోషకాహారం తీసుకుంటూ కనీసం రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్ర చాలా అవసరం.

మీ భావాలను సన్నిహితులతో పంచుకోవాలి.. మీరు ఒంటరిగా ఉన్నారని లేదా బాధగా ఉందనిపిస్తే.. సన్నిహితులతో మనసు విప్పి మాట్లాడండి. మాట్లాడటం వల్ల సగం భారం తగ్గుతుంది.

వెలుగుల పండుగ.. మనసు నిండా సంతోషం.. !

ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పండుగ అనేది ఒక క్యాలెండర్ ఈవెంట్ మాత్రమే. ఆ రోజే అద్భుతంగా ఉండాలనే పట్టుదల వదిలేస్తే మనసు తేలికపడుతుంది. మీకు నచ్చిన చిన్న పని, పుస్తకం చదవడం లేదా నడవడం చేసినా అది మీ మానసిక ఉల్లాసానికి తోడ్పడుతుంది. ఒకవేళ ఈ దిగులు పండుగ తర్వాత కూడా కొనసాగుతుంటే, అది 'డిప్రెషన్' కావచ్చు. అటువంటప్పుడు ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ను కలవడం ఉత్తమం.

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health depression mental-tensions stress anxiety-effect mental-issues emotional-well-being digital-lifestyle emotional-health holiday-blues festival-stress feeling-low-during-holidays holiday-anxiety happiness-during-festivals
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com