90% of Indians Stay Away from Exercise: వ్యాయామానికి దూరంగా 90 శాతం మంది భారతీయులు..పెరుగుతున్న జబ్బులు.. 

సాక్షి లైఫ్ : ప్రస్తుతం హడావిడి జీవనంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా భారతీయులు ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. ఈ విషయం చెప్పేది మేం కాదు.. తాజాగా వెలువడిన గణాంకాలే చెబుతున్నాయి. దేశంలో ప్రతి పది మందిలో తొమ్మిది మంది ఎలాంటి శారీరక వ్యాయామాలు చేయడం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కేవలం 10 శాతం మంది మాత్రమే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

 

ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

పురుషులతో పోలిస్తే మహిళలు..

వ్యాయామం విషయంలో పురుషులతో పోలిస్తే మహిళలు చాలా వెనుకబడి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పురుషులు వ్యాయామం చేసే అవకాశం మహిళల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. ఇంటి పనులు, వృత్తిపరమైన బాధ్యతల మధ్య మహిళలు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

నగరాల్లోనే ఎక్కువ..

గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లో నివసించే వారు వ్యాయామానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. దీనికి ప్రధాన కారణాలు ఏమిటంటే..? నగరాల్లో జిమ్‌లు, పార్కులు అందుబాటులో ఉండటంతోపాటు ఆరోగ్యంగా ఉండాలి అంటే శారీరక శ్రమ అవసరమని గుర్తించడం వల్ల ఎంతోకొంత ఎక్సర్ సైజ్ చేయడానికి ఆసక్తి చుపిస్తున్నారు. నడకకు ప్రత్యేక మార్గాలు (Walking Tracks), యోగా కేంద్రాలు ఉండటం పట్టణాల్లో ఎక్కువగా అందుబాటులో ఉండడమేకాకుండా సోషల్ మీడియా , ఫిట్‌నెస్ కల్చర్ నగరాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందడం వల్ల సిటీల్లో ఉండే ప్రజలు హెల్తీగా ఉండడానికి శారీరక వ్యాయామం చేస్తున్నారు.

నిపుణులు ఏమంటున్నారంటే..? 

శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యలు చిన్న వయసులోనే చుట్టుముడుతున్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు నడక లేదా ఏదైనా శారీరక శ్రమ తప్పనిసరిగా చేయాలని వారు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..! 

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : sedentary-lifestyle healthy-lifestyle exercise poor-lifestyle exercises-for-knee-pain exercise-and-depression depression-and-exercise exercise-burnout healthy-life relaxation-exercises
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com