Does Nail Biting Affect Health: గోళ్లు కొరకడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందా..? ఎలా నివారించాలి..? 

షేర్ చేయండి:
Does Nail Biting Affect Health: గోళ్లు కొరకడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందా..? ఎలా నివారించాలి..? 

సాక్షి లైఫ్ : కొంతమందికి గోళ్లను కొరకడం అనేది అలవాటు ఉంటుంది. కానీ మరికొంతమందికి ఒత్తిడిలో ఉన్నప్పుడో, ఖాళీగా ఉన్నప్పుడో వారికి తెలియకుండానే గోళ్లు కొరుకుతూ ఉంటారు. చిన్న విషయమే కదా అని దీనిని నిర్లక్ష్యం చేస్తే, అది మీ అందాన్నే కాదు.. ఆరోగ్యాన్ని కూడా గుల్ల చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోళ్ల కింద మన కంటికి కనిపించని వేలకొద్దీ బ్యాక్టీరియాలు, ఫంగస్ చేరి ఉంటాయి. గోళ్లు కొరికినప్పుడు అవి నేరుగా నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల కలిగే ప్రధాన నష్టాలు ఏమిటంటే..?

 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..?

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

 

పారానీకియా (Paronychia)..గోళ్ల చుట్టూ ఉన్న చర్మం ఎర్రగా వాచి, ఇన్ఫెక్షన్ రావడానికి ఇది ప్రధాన కారణం. నిరంతరం గోళ్లు కొరకడం వల్ల పళ్లపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. పళ్లు వంకరగా మారే అవకాశం కూడా ఉంది. చేతుల ద్వారా వెళ్లే బ్యాక్టీరియా వల్ల విరోచనాలు, కడుపునొప్పి వంటి జీర్ణసంబంధిత వ్యాధులు వస్తాయి.

మానుకోవడానికి మార్గాలు ఏమిటి..?

ఈ అలవాటును వదిలించుకోవడం కష్టంగా అనిపించినా, కొన్ని చిట్కాలతో సులభంగా అధిగమించవచ్చు. గోళ్లు కొరకడానికి వీలు లేకుండా ఎప్పటికప్పుడు కత్తిరించుకోవడం ఉత్తమం. మార్కెట్లో లభించే చేదు రుచి గల స్పెషల్ నెయిల్ పాలిష్‌లను వాడండి. గోరు నోటి దగ్గరకు వెళ్లగానే ఆ చేదు వల్ల మీ మనస్సు ఆ ప్రయత్నాన్ని ఆపేస్తుంది. టీవీ చూస్తున్నప్పుడో లేదా ఒత్తిడిగా ఉన్నప్పుడో చేతులతో 'స్ట్రెస్ బాల్' నొక్కడం లేదా పెన్నుతో ఏదైనా రాయడం వంటివి చేయండి. యోగా, ధ్యానం వంటి పద్ధతుల ద్వారా మానసిక ప్రశాంతతను పొందితే, ఒత్తిడి వల్ల వచ్చే ఈ అలవాటు క్రమంగా తగ్గుతుంది.

ఒకవేళ మీరు ఎంత ప్రయత్నించినా ఈ అలవాటు మానుకోలేకపోతే, అది కేవలం అలవాటు మాత్రమే కాక 'అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్' (OCD) వంటి మానసిక స్థితికి సంకేతం కావచ్చు. అటువంటప్పుడు నిపుణుడైన కౌన్సిలర్‌ను సంప్రదించడం మంచిది.

 

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.