సాక్షి లైఫ్ : సాధారణంగా దృష్టి మసకబారినా లేదా ఒక వస్తువు రెండుగా కనిపించినా (Double Vision) మనం కళ్లద్దాల సమస్య అనుకుంటాం. కానీ, అకస్మాత్తుగా వచ్చే ఈ 'రెట్టింపు చూపు' వెనుక ప్రాణాంతకమైన పక్షవాతం (Stroke) లేదా తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలు ఉండొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్య భాషలో 'డిప్లోపియా' అని పిలిచే ఈ పరిస్థితి మెదడుకు వెళ్లే రక్తప్రసరణలో ఆటంకాలు కలిగినప్పుడు సంభవించవచ్చు.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
మెదడు కణితి లేదా స్ట్రోక్ కు సంకేతాలు..
ఈ లక్షణాలు కనిపిస్తే.. అది కేవలం కంటి సమస్య మాత్రమే కాదు, మెదడు కణితి లేదా స్ట్రోక్ కు సంకేతాలుగా పరిగణించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. ఎటువంటి ముందస్తు సూచనలు లేకుండా హఠాత్తుగా చూపు మందగించినా, ఒక వస్తువు రెండుగా కనిపించినా పక్షవాతానికి ప్రధాన సంకేతంగా భావించాలని అంటున్నారు పరిశోధకులు.
తలతిరగడం (Dizziness)..చూపు మసకబారడంతో పాటు తల తిరగడం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పడం వంటివి జరిగితే అది మెదడులోని వెనుక భాగం ప్రభావితమైందని అర్థం. ఒకే వస్తువు రెండుగా కనిపిస్తూ, అదే సమయంలో స్పష్టంగా మాట్లాడలేకపోవడం (Slurred Speech) అత్యంత ప్రమాదకరం. ఒక వైపు కంటి రెప్ప కిందకు జారడం (Drooping Eyelid) లేదా ముఖంలో ఒక పక్క కండరాలు బిగుసుకుపోవడం.
దృష్టి లోపంతో పాటు..
తీవ్రమైన తలనొప్పి..గతంలో ఎన్నడూ లేని విధంగా అకస్మాత్తుగా భరించలేనంత తలనొప్పి రావడం. కాళ్లు లేదా చేతుల్లో ఒక వైపు స్పర్శ కోల్పోవడం లేదా బలహీనంగా అనిపించడం. మెడ నొప్పులు: దృష్టి లోపంతో పాటు మెడ బిగుసుకుపోవడం (Neck Stiffness) మెదడులో రక్తస్రావం (Aneurysm) జరిగే అవకాశాన్ని సూచిస్తుంది.
ఒక కన్ను మూసుకున్నప్పుడు రెండో చిత్రం కనిపించకుండా పోతే, అది సాధారణంగా నరాల లేదా కండరాల సమన్వయ లోపం వల్ల వస్తుంది (Binocular Diplopia). ఇది మెదడు సంబంధిత సమస్యగా మారే అవకాశం ఎక్కువగా . అదే ఒక కన్ను మూసినా రెట్టింపు చూపు అలాగే ఉంటే (Monocular Diplopia), అది కంటి లోపల శుక్లాలు లేదా రెటినా సమస్య కావచ్చు.
పక్షవాతం విషయంలో ప్రతి నిమిషం విలువైనదే. ఈ లక్షణాలు కనిపించిన సమయాన్ని 'గోల్డెన్ అవర్' అంటే మొదటి 3గంటల నుంచి 4 గంటలు లోపు ఆస్పత్రికి చేర్చగలిగితే మెదడుకు జరిగే శాశ్వత నష్టాన్ని నివారించవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com