Bad Cholesterol : గుండెకు కొండంత అండ.. బ్యాడ్ 'కొలెస్ట్రాల్‌'కు సరైన పరిష్కారం..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గుండె ఆరోగ్యం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి ఎల్‌డీఎల్ (LDL - చెడు కొలెస్ట్రాల్), హెచ్‌డీఎల్ (HDL - మంచి కొలెస్ట్రాల్). అయితే, వీటితో పాటు రక్తం లోపల అత్యంత ప్రమాదకరంగా దాగి ఉండే మరో శత్రువు 'రెమ్నెంట్ కొలెస్ట్రాల్' (Remnant Cholesterol). దీని వల్ల గుండెపోటు వచ్చే ముప్పు అధికమని తెలిసినా, ఇప్పటివరకు దీన్ని తగ్గించడానికి సరైన మందులు అందుబాటులో లేవు. తాజాగా జరిపిన ఒక క్లినికల్ ట్రయల్‌లో సరికొత్త ఔషధం ఈ మొండి కొలెస్ట్రాల్‌ను రికార్డు స్థాయిలో 60 శాతానికి పైగా తగ్గించినట్లు నిపుణులు వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

ఇది కూడా చదవండి..Vitamin D Superfoods : విటమిన్ డి సూపర్ ఫుడ్స్: ఈ నాలుగు ఫుడ్స్ తీసుకుంటే సరిపోతుంది.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

 

ఏమిటీ 'రెమ్నెంట్' కొలెస్ట్రాల్..?

శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, రక్తం నుంచి కొవ్వు కణాలు విచ్ఛిన్నమయ్యే క్రమంలో ఈ 'రెమ్నెంట్' లేదా మిగిలిపోయిన కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది. ఇది నేరుగా రక్తనాళాల గోడలకు అంటుకుపోయి అడ్డంకులు ఏర్పడేలా చేస్తుంది. సాధారణ ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉన్నప్పటికీ, చాలామందిలో గుండెపోటు రావడానికి ఈ రెమ్నెంట్ కొలెస్ట్రాలే ప్రధాన కారణమని వైద్యులు గుర్తించారు.

పరిశోధనలో తేలిందేమిటి..?

ఒక ఆధునిక ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఈ మందు RNA-ఆధారిత చికిత్స పై జరిపిన పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఈ మందు వాడిన రోగుల్లో రెమ్నెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలు 60 నుంచి 65 శాతం వరకు తగ్గాయి. రక్తంలోని ఇతర కొవ్వు పదార్థాలను ట్రైగ్లిజరైడ్స్ ను కూడా ఇది సమర్థవంతంగా నియంత్రించగలిగింది. ప్రాథమిక పరీక్షల్లో రోగులకు ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు కలగలేదని పరిశోధకులు స్పష్టం చేశారు.

ఎవరికి ప్రయోజనం..?

సాధారణంగా స్టాటిన్ (Statin) మందులు వాడుతున్నా కొలెస్ట్రాల్ తగ్గని వారికి, అలాగే వంశపారంపర్యంగా అధిక కొవ్వు సమస్య ఉన్నవారికి ఈ కొత్త చికిత్స ఒక వరమని చెప్పవచ్చు. రక్తనాళాల్లో పూడికలు (Atherosclerosis) రాకుండా అడ్డుకోవడంలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వైద్య రంగంలో ఇవి శుభ పరిణామాలు అయినప్పటికీ.. క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య ఆహారం, ఒత్తిడి లేని జీవనశైలి మాత్రమే గుండెను కలకాలం పదిలంగా ఉంచుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.

 

 ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..  

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.