సాక్షి లైఫ్ : శాకాహారులకు 'పనీర్' ఒక అద్భుతమైన వరప్రసాదం. కండరాల పుష్టికి, శారీరక శక్తికి జిమ్ వెళ్లే యువత నుంచి ఎదుగుతున్న పిల్లల వరకు అందరూ పనీర్‌ను ఇష్టంగా తింటారు. అయితే, పనీర్ తింటున్నామన్న తృప్తి ఉందే తప్ప.. దాని నుంచి అందాల్సిన పూర్తి ప్రోటీన్ శరీరానికి చేరుతోందా? అంటే సందేహమే. మనం చేసే చిన్న చిన్న వంట పొరపాట్ల వల్ల పనీర్‌లోని పోషకాలు నశించి, కేవలం కాలరీలు మాత్రమే మిగులుతున్నాయని పోషకాహారనిపుణులు చెబుతున్నారు. మీరు కూడా పనీర్ వండేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? ఒక్కసారి సరిచూసుకోండి..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
మరుగుతున్న నీటిలో వేయడం వల్ల..
చాలామంది పనీర్ ముక్కలు మెత్తగా రావాలని వాటిని బాగా మరుగుతున్న నీటిలో వేస్తుంటారు. పనీర్‌లోని ప్రోటీన్లు అధిక ఉష్ణోగ్రతలకు చాలా సున్నితంగా స్పందిస్తాయి. 100°C కంటే ఎక్కువ వేడి ఉన్న నీటిలో వేయడం వల్ల ప్రోటీన్ నిర్మాణం దెబ్బతింటుంది. పనీర్ రబ్బరులా సాగుతూ గట్టిగా మారుతుంది. దీనివల్ల అందులోని విటమిన్ బి-కాంప్లెక్స్ వంటి పోషకాలు నీటి పాలవుతాయి. పనీర్‌ను ఎప్పుడూ ఉడికించవద్దు. అది గట్టిగా ఉంటే, కేవలం గోరువెచ్చని నీటిలో 5-10 నిమిషాల పాటు నానబెడితే చాలు, పోషకాలు పోకుండా మెత్తగా మారుతుంది.
రుచి కోసం డీప్ ఫ్రై చేస్తున్నారా..?
మటర్ పనీర్ లేదా కడాయి పనీర్ చేసేటప్పుడు ముక్కలను నూనెలో ఎర్రగా వేయించడం మనకు అలవాటు. ఇది రుచిని పెంచవచ్చు కానీ, ఆరోగ్యాన్ని హరిస్తుంది. అధిక వేడి వద్ద డీప్ ఫ్రై చేయడం వల్ల పనీర్ పై పొర గట్టిపడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. పైగా పనీర్‌లోని మంచి కొవ్వులు ఆక్సీకరణం చెంది ప్రోటీన్ నాణ్యత తగ్గుతుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి శాపంగా మారి, అనవసర కాలరీలను పెంచుతుంది. పనీర్‌ను డీప్ ఫ్రై చేయడానికి బదులు, తక్కువ నూనెతో సాటే (Sauté) చేయండి. లేదా నేరుగా కూరల్లో వేయడం వల్ల ప్రోటీన్ చెక్కుచెదరకుండా ఉంటుంది.
నిల్వ చేయడంలో..
పనీర్ త్వరగా పాడైపోయే ఆహార పదార్థం. దీనిని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా చేరి ప్రోటీన్ క్షీణిస్తుంది. గాలి తగిలేలా బయట ఉంచడం లేదా ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో వదిలేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. పనీర్‌ను ఒక గిన్నెలో పోసి, ముక్కలు మునిగేలా నీటిని నింపి ఫ్రిజ్‌లో భద్రపరచాలి. ప్రతిరోజూ ఆ నీటిని మారుస్తూ ఉంటే 2 లేదా 3 రోజుల పాటు పనీర్ తాజాగా, పోషకాలతో నిండి ఉంటుంది. ఆహారం కేవలం కడుపు నింపడానికే కాదు, ఒంటికి శక్తిని ఇచ్చేదిగా ఉండాలి. అందుకోసం వండే విధానం కూడా ప్రధానమేనని అంటున్నారు పోషకాహారనిపుణులు.
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com