Dandruff : కొత్త షాంపూతో చుండ్రు వస్తుందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..!
సాక్షి లైఫ్ : మీరు ఎంతో ఆశగా ఒక కొత్త షాంపూ ట్రై చేసిన మూడు రోజుల్లోనే తలపై పొలుసులుగా (Flaking) రాలడం గమనించారా..? అయితే, దీనికి ఆ కొత్త షాంపూనే కారణమని వెంటనే నిందిస్తుంటారు. కానీ, అది నిజమేనా..? దీనికి వైద్యులు ఇస్తున్న సమాధానం ఏమిటంటే.. షాంపూ మార్చడం వల్ల అప్పటికప్పుడు కొత్తగా చుండ్రు పుట్టుకురాదు. అయితే, మీ తలలో ఇప్పటికే దాగున్న చుండ్రు సమస్యను అది బయటపడేలా మాత్రం చేస్తుందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది ప్రధానంగా మలసేజియా (Malassezia) అనే ఈస్ట్, తలపై నూనె ఉత్పత్తి (Oil production) సున్నితత్వం (Sensitivity) వల్ల కలుగుతుంది. కొత్త షాంపూకి మారడం వల్ల మీ తలలో ఇప్పటికే ఉన్న సమస్య ఒక్కసారిగా బయటపడుతుంది లేదా మరింత తీవ్రమవుతుందని డెర్మటాలజిస్ట్ లు వెల్లడిస్తున్నారు. అందుకే చాలా మంది కొత్త ప్రొడక్ట్ వాడిన వెంటనే తలలో పొలుసులు రాలడాన్ని గమనించి, ఆ షాంపూనే తన సమస్యకు కారణమని భావిస్తుంటారు.
కొత్త షాంపూ వాడిన వెంటనే చుండ్రు ఎందుకు కనిపిస్తుంది..?
ఎక్కువ పొడిబారడం..
మీరు వాడే కొత్త ఫార్ములా మీ పాత షాంపూ కంటే ఎక్కువ పొడిబారేలా (Drying) చేయవచ్చు. ఇది మీ తలపై ఉండే తేమ సమతుల్యతను దెబ్బతీసి, చుండ్రును పోలిన పొలుసులు రాలేలా చేస్తుంది. అయితే ఇది అసలు చుండ్రు కాదు, కేవలం చర్మం ఎదుర్కొనే చికాకు (Irritation) మాత్రమే.
ఎక్కువ మాయిశ్చరైజింగ్..
కొత్త షాంపూ మరింత రిచ్‌గా లేదా ఎక్కువ మాయిశ్చరైజింగ్‌గా ఉండవచ్చు. మిగిలిపోయిన అవశేషాలు (Residue) తలపై నూనెను నిల్వ ఉంచుతాయి. ఇది ఇప్పటికే చుండ్రు సమస్య ఉన్నవారిలో మలసేజియా ఈస్ట్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
అలెర్జీ లేదా చికాకు..
కొత్త షాంపూలోని సువాసనలు (Fragrance), సల్ఫేట్లు లేదా ఇతర రసాయనాలు చర్మానికి తేలికపాటి ఇన్ఫెక్షన్ లేదా చికాకును కలిగించవచ్చు. ఇది చూడటానికి అచ్చం చుండ్రులాగే కనిపిస్తుంది కానీ, అది పూర్తిగా వేరే రియాక్షన్.
మెడికేటెడ్ షాంపూ ఆపేయడం.. అంతవరకు వాడుతున్న యాంటీ-డాండ్రఫ్ లేదా మెడికేటెడ్ షాంపూని ఆపేసి, కొత్తది ట్రై చేయడం వల్ల ఒక్కసారిగా చుండ్రు తిరిగి కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటివరకు ఆ ఈస్ట్ అతిగా పెరగకుండా నియంత్రణలోఉన్నదే తప్ప, పూర్తిగా నయం కాలేదు. ఏదైనా కొత్త ప్రొడక్ట్‌కు మీ తల అలవాటు పడటానికి ఒకటి రెండు వారాల సమయం పడుతుంది. ఈ మధ్య కాలంలో వచ్చే పొలుసులు తాత్కాలికమే తప్ప, ఆ షాంపూ కారణం మాత్రం కాదు.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
