నోరోవైరస్ గురించి మీకు తెలుసా..?

షేర్ చేయండి:
నోరోవైరస్ గురించి మీకు తెలుసా..?

సాక్షి లైఫ్: నోరోవైరస్, "స్టమక్ బగ్" అని కూడా పిలుస్తారు. ఇది గ్యాస్ట్రోఎంటెరిటిస్, కడుపు, ప్రేగుల వాపునకు కారణమయ్యే అంటువ్యాధి. అనేక దేశాలలో దీని బారీన పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నోరో వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి బారీన పడిన వారిలో అతిసారం, వాంతులు, వికారం, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. 

ఇది కూడా చదవండి..హాట్ వాటర్ తాగడం వల్ల మూసుకుపోయిన ముక్కు క్లియర్ అవుతుందా..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రావడానికి కారణాలు ఇవే..?

  ఇది కూడా చదవండి.. సహజంగా మెరిసే చర్మం కోసం సరైన చిట్కాలు

కలుషితమైన ఆహారం..

నోరోవైరస్ కలుషితమైన ఆహారం, కలుషిత నీటి కారణంగా తలెత్తుతుంది.  ఈ వ్యాధి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి  ద్వారా సులభంగా వ్యాపిస్తుంది. నోరోవైరస్ అనేది తీవ్రమైన అంటువ్యాధి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులలో ఈ వైరస్ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. దాని వ్యాప్తిని నిరోధించడంలో సరైన పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి. 

అమెరికాలో.. 

యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) ప్రకారం, ప్రతి సంవత్సరం నవంబర్, ఏప్రిల్ మధ్య అమెరికాలో వేలాది సంఖ్యలో నోరోవైరస్ కేసులు వస్తుంటాయి. నోరోవైరస్‌ని 'వింటర్ వొమిటింగ్ బగ్' అని,  'నార్వాక్ వైరస్' అని కూడా పిలుస్తారు.

ఇది కూడా చదవండి..వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?

ఇది కూడా చదవండి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

 

   ఇది కూడా చదవండి.. పెరుగుతున్న చాందీపురా వైరస్ కేసులు..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.