శాఖాహారం గురించి ఆయుర్వేదంలో వైద్యనిపుణులు ఏమి చెప్పారో తెలుసా..?  

షేర్ చేయండి:
శాఖాహారం గురించి ఆయుర్వేదంలో వైద్యనిపుణులు ఏమి చెప్పారో తెలుసా..?  

సాక్షి లైఫ్ : శతాబ్దాలుగా, భారతీయ పాక సంప్రదాయం వివిధ రకాలైన ఆహార ధాన్యాలను పండించడం, నాటడం, కోయడం, వంట చేయడం, సంరక్షించడం వంటి వాటి ఆధారంగా వివిధ సీజన్‌ల ఆధారంగా కూరగాయల వినియోగానికి ప్రత్యేకమైన నమూనాను రూపొందించింది. ఈ ప్రక్రియలన్నింటికీ ఆయుర్వేదం మూలాధారమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద శాస్త్రంలో వివిధ ఆహార ధాన్యాల ఉపయోగం గురించి చాలా బాగా తెలిపారు. 

ఇది కూడా చదవండి..అనారోగ్య సమస్యలను నివారించడానికి సమతుల్య ఆహారం ఎలా సహాయపడుతుంది..?

ఇది కూడా చదవండి..ఇలాంటి ఐదు రకాల ఆరోగ్యకరమైన అలవాట్లతో ఏరోగం లేకుండా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..ఆహారం విషయంలో ఏది బెటర్ శాఖాహారమా..? మాంసాహారమా..?

ఆయుర్వేదంలో సీజన్ ప్రకారం ఆహారపు అలవాట్లకు మార్గదర్శకాలు ఉన్నాయి. దీనిని ఋతుచార్య అని పిలుస్తారు. ఇందులో ఋతు అంటే సీజన్, చార్య అంటే మార్గదర్శకం. ఇవి వివిధ సీజన్‌లు , స్థానిక ఉత్పత్తులను పరిగణనలోకి తీసుకుని ఏడాది పొడవునా ఆహారం ,జీవనశైలి మార్పులకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. కాలానుగుణ కూరగాయలు శరీరానికి తగిన మొత్తంలో పోషకాలను అందించే సహజ సాధనం, సాంప్రదాయ ఆహారం ప్రతి సీజన్‌లో స్థానికంగా లభించే అన్ని వస్తువులను కలిగి ఉంటుంది.

 “కూరగాయలు నిజానికి జీర్ణించుకోవడం కొంచెం కష్టం, అందుకే ఆయుర్వేదం ఈ సమస్యపై దృష్టి పెడుతుంది. కూరగాయలు ఎప్పుడు..? ఎలా తినాలి..? అనేదానికి చాలా ప్రాధాన్యతనిస్తుంది. సరైన మొత్తంలో కొవ్వు , సుగంధ ద్రవ్యాలతో కూరగాయలను ఉడికించడం చాలా ముఖ్యం, తద్వారా మనం సరైన ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతామని ఆయుర్వేద వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. 

 రోగనిరోధక శక్తి , ఆరోగ్య స్పృహపై అవగాహన పెరగడంతో పాటు సీజనల్ కూరగాయలు, ఆహార పదార్థాలకు ఆయుర్వేదం ఆధారంగా జీవనశైలిలో ఋతుచార్యకు గొప్ప ప్రాముఖ్యత ఇస్తుంటారు. ఇది సీజన్లలో మార్పులు ,నిర్దిష్ట సమయాల్లో కొన్ని కూరగాయల వినియోగంతో ఆహారంలో మార్పులను సిఫార్సు చేస్తుంది. 

ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.