స్క్రీన్ టైమ్ డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందా..?

సాక్షి లైఫ్ : ఇటీవల వెల్లడైన ఓ అధ్యయనంలో ఆన్‌లైన్‌లో డయాబెటిస్ గురించి సెర్చ్ చేసే వారిలో 48శాతం మంది జనరేషన్ జెడ్ (18-24 ఏళ్ల వయసు ఉన్న) వారేనని తేలింది. ముఖ్యంగా వీరిలో డయాబెటిస్ పట్ల ఆందోళన పెరగడానికి డిజిటల్ జీవనశైలే ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Kids health : పిల్లల్లో డెంగ్యూ ఫీవర్ ఎందుకు ప్రాణాంతకం..?

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 

డయాబెటిస్ అనేది కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చే వ్యాధి కాదు. యువతలో సైతం ఈ కేసులు మరింతగా పెరుగుతున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరోగ్యమే అసలైన సంపద అనే స్లోగన్ పై నేటితరం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎదుకంటే డిజిటల్ యుగంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక సవాలుగా మరింది. డిజిటల్ జీవన శైలి కారణంగా మధుమేహ సమస్య బారీన ఎక్కువగా పడుతున్నారు. అయితే చిన్న చిన్న మార్పులతో డయాబెటిస్‌ కు దూరంగా ఉండవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.

 డిజిటల్ జీవనశైలి ప్రభావం.. 

స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లతో గంటల తరబడి గడపడం, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడంతోపాటు అనారోగ్య కరమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు యువతలో డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. "స్క్రీన్ టైమ్ పెరగడం, ఒత్తిడి, నిద్రలేమి, ఫాస్ట్ ఫుడ్‌పై ఆధారపడటం వంటివి ఈ వ్యాధికి దారితీస్తున్నాయి," అని ఎండోక్రైనాలజిస్టులు అంటున్నారు.   

 ఆందోళనకరమైన గణాంకాలు.. 

తాజా నివేదిక ప్రకారం భారత్దేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య గత దశాబ్దంలో గణనీయంగా పెరిగింది. జనరేషన్ జెడ్ లో ఈ వ్యాధి గురించి అవగాహన ఉన్నప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించే వారు తక్కువగా ఉన్నారు. యువత ఆన్‌లైన్‌లో సమాచారం కోసం వెతుకుతోంది, కానీ ఆచరణలో మార్పు చేసుకోవడం లేదు," అని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నివారణ ఎలా..?  
 
డయాబెటిస్ నివారణకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.. క్రమం తప్పకుండా వ్యాయామం..రోజూ కనీసం 30 నిమిషాలు నడక, యోగా లేదా జిమ్ తప్పనిసరి. ఆరోగ్యకరమైన ఆహారం..ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవాలి. స్క్రీన్ టైమ్ తగ్గించాలి.. రాత్రిపూట ఫోన్ వాడకాన్ని తగ్గించి, సరిపడా నిద్ర పోవాలి. రెగ్యులర్ చెకప్‌లు.. రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి.  

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గితే ప్రాణాలకు ఎందుకు ప్రమాదం..? 

ఇది కూడా చదవండి..గట్ హెల్త్ ను కాపాడడంలో ఏమేం అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health diabetes sugar-levels sugar-problem diabetes-affect diabetes-risk diabetes-patients screen-time digital-detox
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com