కుక్క కాటుకు గురైన వెంటనే ఏం చేయాలి..? ఏం చేయకూడదు..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కుక్క కాటుకు గురైన వెంటనే చాలామంది తేలికగా తీసుకుంటారు. ఆలస్యం చేస్తే ఇన్ఫెక్షన్ పెరిగి, వ్యాధి తీవ్రత మరింతగా  పెరుగుతుందని చెబుతున్నారు వైద్యనిపుణులు. ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే..? రేబిస్ వ్యాధికి చికిత్స లేదు, కానీ సరైన సమయంలో టీకాలు వేయించుకుంటే దానిని పూర్తిగా నివారించవచ్చు. అందుకే కుక్క కాటును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని,  ఒకవేళ కరిస్తే, ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవడమే ప్రాణాలను కాపాడుకునే ఏకైక మార్గమని నిపుణులు వెల్లడిస్తున్నారు.

 

 

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి.. పిల్లలకు ఆర్ఎస్వీ వైరస్ ముప్పు.. ఎవరికి ఎక్కువ..?

ఇది కూడా చదవండి..Calories : రోజుకు మన శరీరానికి ఎన్ని క్యాలరీలు అవసరం..?

 

గాయాన్ని..

వెంటనే శుభ్రం చేయండి: కుక్క కరిచిన వెంటనే ఆ గాయాన్ని సబ్బు నీటితో కనీసం 15 నిమిషాల పాటు బాగా కడగాలి. ఇది వైరస్ వ్యాప్తిని చాలా వరకు తగ్గిస్తుంది. వెంటనే వైద్యుడిని సంప్రదించండి: గాయాన్ని శుభ్రం చేసిన తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. డాక్టర్ సలహా మేరకు తప్పనిసరిగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి.  
 
టీకాలు: కుక్క కాటు తీవ్రతను బట్టి వైద్యులు సూచించిన విధంగా టీకాల కోర్సును పూర్తి చేయాలి. ఇది వ్యాధిని నివారించడానికి ఉన్న ఏకైక మార్గం. పెంపుడు జంతువుల సంరక్షణ: పెంపుడు కుక్కలకు సమయానికి టీకాలు తప్పనిసరిగా వేయించాలి. బయటి కుక్కలతో అవి కలవకుండా చూసుకోవాలి. వీధి కుక్కలతో జాగ్రత్త: వీధి కుక్కలకు దూరంగా ఉండండి. వాటిని టీజ్ చేయడం, వాటి దగ్గరకు వెళ్లడం లాంటివి చేయకూడదు.

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.