Protein Alternatives : మీరు గుడ్లు తినరా..? అయితే ప్రోటీన్ కోసం ఈ 5 ప్రత్యామ్నాయాలను ట్రై చేయండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలన్నా, కండరాల పుష్టి కలగాలన్నా శరీరానికి ప్రోటీన్లు అత్యంత అవసరం. ప్రోటీన్, విటమిన్లు అనగానే చాలామందికి మొదటగా గుర్తొచ్చేది గుడ్డు (Egg). అయితే, అందరూ గుడ్లు తినడానికి ఇష్టపడరు. కొందరు ప్యూర్ వెజిటేరియన్స్ కావడం వల్ల, మరికొందరు అలర్జీలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల గుడ్లకు దూరంగా ఉంటారు. మరి అలాంటప్పుడు గుడ్డు ద్వారా లభించే పోషకాలను శాకాహారులు ఎలా పొందాలి..?

సంతృప్తికరమైన విషయమేమిటంటే.. గుడ్డుకు బదులుగా శరీరానికి అవసరమైన ప్రోటీన్, కాల్షియం, ఐరన్, గుడ్ ఫ్యాట్స్ అందించే అద్భుతమైన శాకాహార ప్రత్యామ్నాయాలు మనకు అందుబాటులో ఉన్నాయి. మన రోజువారీ సమతుల్య ఆహారంలో భాగంగా చేర్చుకోదగ్గ ఆ 5 సూపర్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

 

1. పనీర్ (Paneer)..  

శాకాహారులకు ప్రోటీన్, కాల్షియం అందించే వనరుల్లో పనీర్ అగ్రస్థానంలో ఉంటుంది. ఇది కండరాల పటిష్టతకు, ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. తిన్న తర్వాత ఎక్కువ సమయం ఆకలి వేయకుండా చూస్తుంది. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లేవారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక.

లాభాలు..అధిక ప్రోటీన్, ఎముకలకు మేలు చేసే కాల్షియం లభిస్తుంది.

ఎలా తీసుకోవచ్చు..? సలాడ్లు, కూరలు, శాండ్‌విచ్‌లు లేదా గ్రిల్డ్ పనీర్ రూపంలో డైట్‌లో చేర్చుకోవచ్చు.

2. సోయా చంక్స్ (Soy Chunks)..

మొక్కల ఆధారిత ప్రోటీన్లలో సోయా చంక్స్‌ను 'పవర్ హౌస్' అని చెప్పవచ్చు. గుడ్డుతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ ప్రోటీన్లను ఇది అందిస్తుంది. దీనితో పాటు ఐరన్, ఫైబర్ (fiber) కూడా ఇందులో సమృద్ధిగా ఉంటాయి.

లాభాలు: కండరాల పుష్టికి అవసరమైన ప్రోటీన్లతో పాటు బరువును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

ఎలా తీసుకోవచ్చు?: పులావ్, వెజిటబుల్ కర్రీస్ లేదా సలాడ్లలో వాడుకోవచ్చు.

3. పప్పుధాన్యాలు (Pulses & Lentils).. 

మన వంటింట్లో నిత్యం ఉండే పెసలు, మసూర్ పప్పు, మినప పప్పు, శనగ పప్పు వంటి పప్పుధాన్యాలు ప్రోటీన్ల గిడ్డంగులు. వీటిలో శరీరానికి తక్షణ శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లతో పాటు ఫైబర్, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.

లాభాలు..జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, రోజంతా శరీరానికి కావాల్సిన దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి.

ఎలా తీసుకోవచ్చు..?

 రోజూ మధ్యాహ్న భోజనంలో ఏదో ఒక పప్పు రూపంలో లేదా మొలకెత్తిన గింజలుగా తీసుకోవచ్చు.

4. గ్రీక్ యోగర్ట్, గట్టి పెరుగు (Greek Yogurt)..

సాధారణ పెరుగుతో పోలిస్తే గ్రీక్ యోగర్ట్‌లో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువ. ఇందులో కాల్షియంతో పాటు పొట్ట ఆరోగ్యానికి మేలు చేసే 'ప్రోబయోటిక్స్' లభిస్తాయి.

లాభాలు.. రోగనిరోధక శక్తిని (Immunity) పెంచుతుంది, జీర్ణక్రియను చురుగ్గా ఉంచుతుంది.

ఎలా తీసుకోవచ్చు..?

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో లేదా సాయంత్రం స్నాక్ సమయంలో పండ్ల ముక్కలతో కలిపి తీసుకోవచ్చు.

5. శనగలు, చిక్కుడు గింజలు (Chickpeas & Beans)..

నల్ల శనగలు, కాబూలీ శనగలు, రాజ్మా, వివిధ రకాల చిక్కుడు గింజలలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, ఫోలేట్ వంటి అత్యవసర పోషకాలు దాగున్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తాయి.

లాభాలు..

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి, బరువు మేనేజ్‌మెంట్‌లో అద్భుతంగా పనిచేస్తాయి.

ఎలా తీసుకోవచ్చు..?

 సాయంత్రం పూట గుగ్గిళ్ల రూపంలో లేదా కూరలుగా వండుకుని తినవచ్చు. గుడ్డు తినని వారు ఈ ఆహార పదార్థాలను మార్చి మార్చి తమ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన సంపూర్ణ పోషకాలను, ప్రొటీన్లను ఎలాంటి లోటు లేకుండా సులభంగా పొందవచ్చు.

 

ఇది కూడా చదవండి..Gen Z Trend ‘Panic Pouch’ : జెన్ జెడ్ ట్రెండ్ ‘పానిక్ పౌచ్’.. యాంగ్జైటీ, ఒత్తిడికి చెక్ పెట్టే మినీ కిట్..!

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.