BRCA1 : బిఆర్సీఏ1 మ్యుటేషన్ ఉన్నవారిలో క్యాన్సర్‌కు కారణమవుతున్న ఈస్ట్రోజెన్..!
సాక్షి లైఫ్ : వంశపారంపర్యంగా వచ్చే 'బిఆర్సీఏ1' (BRCA1) జన్యు మార్పులు (Mutations) ఉన్న మహిళల్లో రొమ్ము, అండాశయ క్యాన్సర్ల ముప్పు ఎందుకు ఎక్కువగా ఉంటుందనే అంశంపై శాస్త్రవేత్తలు కీలక విషయాలను కనుగొన్నారు. సాధారణంగా ఈస్ట్రోజెన్ హార్మోన్ కేవలం హార్మోన్ రిసెప్టర్లు ఉన్న కణాలపైనే ప్రభావం చూపుతుందని భావిస్తారు. కానీ, తాజా అధ్యయనం ప్రకారం.. ఈస్ట్రోజెన్ నేరుగా మన DNAను దెబ్బతీసి క్యాన్సర్‌కు దారితీస్తుందని వెల్లడైంది.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
క్యాన్సర్‌కు కారణమవుతున్న ఈస్ట్రోజెన్..!
సాధారణంగా BRCA1 మ్యుటేషన్ ఉన్నవారికి వచ్చే రొమ్ము క్యాన్సర్లు 'ట్రిపుల్ నెగటివ్' రకానికి చెందినవి. వీటికి హార్మోన్ చికిత్సలు అంతగా పనిచేయవు. అయితే, ఈస్ట్రోజెన్ దాని ఉప-ఉత్పత్తులు (Metabolites) కణాల్లోని DNA ప్రతికృతి (Replication) ప్రక్రియను అడ్డుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
DNA డ్యామేజ్..
ఈస్ట్రోజెన్ వల్ల DNA పోగులు తెగిపోవడం, భారీ మార్పులు (Deletions) చోటుచేసుకోవడం జరుగుతోంది. ఇది చివరకు క్యాన్సర్ కణాల ఉత్పత్తికి కారణమవుతోంది. కేవలం శరీరంలోని హార్మోన్లే కాకుండా, బయటి పర్యావరణ కారకాలు కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తు న్నారు. అట్రాజైన్ (Atrazine)..వ్యవసాయంలో విరివిగా వాడే ఈ కలుపు సంహారకం కూడా శరీరంలోకి ప్రవేశించినప్పుడు DNA ప్రతికృతిని అడ్డుకుంటోంది. BRCA1 లోపం ఉన్న మహిళల్లో ఈ రసాయనం వల్ల జన్యుపరమైన అస్థిరత మరింత పెరుగుతున్నట్లు పరిశోధనలో తేలింది.
ఆహారంతో చెక్..!
ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి ఒక ఆశాజనకమైన మార్గాన్ని కూడా పరిశోధకులు సూచించారు. మన రోజువారీ ఆహారంలో ఉండే కొన్ని సమ్మేళనాలు ఈ డ్యామేజ్‌ను అడ్డుకోగలవని గుర్తించారు. ఇండోల్-3-కార్బినోల్ (Indole-3-carbinol): క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీ వంటి కూరగాయల్లో లభించే ఈ పదార్థం DNA పై ఈస్ట్రోజెన్ చూపే ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తోంది.
ఇది కణాల్లో కలిగే ఒత్తిడిని (Replication Stress) తగ్గించి, జన్యువులు దెబ్బతినకుండా రక్షిస్తోంది. BRCA1 మ్యుటేషన్ ఉన్నవారు ఈస్ట్రోజెన్ ప్రభావం నుంచి రక్షణ పొందేందుకు 'ఇండోల్-3-కార్బినోల్' వంటి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం ఒక నివారణా చర్యగా ఉపయోగపడవచ్చని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. భవిష్యత్తులో ఇది కొత్త చికిత్సా విధానాలకు దారితీసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
