ప్రపంచవ్యాప్తంగా నిషేధిత ఆహార పదార్థాలు - మీరూ తెలుసుకోండి..!

సాక్షి లైఫ్ : ప్రపంచంలోని వివిధ దేశాల్లో అక్కడి నియమ నిబంధనల ప్రకారం కొన్ని ఆహార పదార్థాలను నిషేధించారు. ఆరోగ్య కారణాలు లేదా సాంస్కృతిక కారణాల దృష్ట్యా ఈ నిషేధాలు అమల్లో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..చూయింగ్ గమ్ (సింగపూర్): పరిశుభ్రతకు పేరుగాంచిన సింగపూర్‌లో చూయింగ్ గమ్ తినడం నిషేధం. కొనాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి.

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?

ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?

సమోసా (సోమాలియా): రుచికరమైన సమోసాను సోమాలియాలో పూర్తిగా నిషేధించారు. దీనికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు.

చ్యవన్ ప్రాష్ (సింగపూర్, తైవాన్, సౌదీ అరేబియా, కెనడా): భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన చ్యవన్ ప్రాష్‌ను మార్ఫిన్ కంటెంట్ కలిగి ఉండటం వల్ల సింగపూర్, తైవాన్‌లలో నిషేధించారు. సౌదీ అరేబియా, కెనడాలోనూ దీనిపై నిషేధం ఉంది. సింగపూర్‌లోని సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో దీనిని నిషేధించింది.

కిండర్ జాయ్ (అమెరికా): పిల్లలు ఇష్టపడే కిండర్ జాయ్‌ను అమెరికాలో నిషేధించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని అక్కడి ప్రభుత్వం అనుమతించకపోవడమే దీనికి కారణం. పిల్లల ఆహార పదార్థాల విషయంలో వారు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

కెచప్ (ఫ్రాన్స్‌లోని పాఠశాలలు): ఫ్రెంచ్ ఫ్రైస్‌తో ఎంతో రుచిగా ఉండే కెచప్‌ను ఫ్రాన్స్‌లోని పాఠశాలల్లో నిషేధించారు. ఫ్రాన్స్ సంప్రదాయ వంటకాలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం.

నెయ్యి (అమెరికా): భారతీయులు ఎంతో ఇష్టంగా తినే నెయ్యిని అమెరికాలో నిషేధించారు. అక్కడి ఆరోగ్య సూత్రాల ప్రకారం నెయ్యి తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట.

 

 ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.. 

Tags : harmful-to-health food-health bad-food ghee usa america food chyawan-prash kinder-joy ketchup chewing-gum samosa samosas india’s-first-diabetes-biobank doctors health-experts
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com