చెంచాతో కాకుండా చేతులతో తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. 

షేర్ చేయండి:
చెంచాతో కాకుండా చేతులతో తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. 

సాక్షి లైఫ్ : పూర్వకాలంలో మన పూర్వీకులు చేతులతోనే ఆహారం తీసుకునేవాళ్లు. చేతులతో ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు. చేతులతో తినడం జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుందని ఆయుర్వేద వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. అంతేకాదు దీని వల్ల అనేక రోగాల బారిన పడకుండా ఉండొచ్చట. చేతులతో ఆహారం తీసుకోవడం ద్వారా బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు. చెంచా వదిలి చేతులతో ఆహారం తింటే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి. దీనివల్ల ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..  

 ఇది కూడా చదవండి..చిన్నారుల్లో కార్డియాక్ అరెస్ట్ కారణాలు..?

 ఇది కూడా చదవండి..ఏ శస్త్రచికిత్సలకు అనస్తీషియా అవసరం?

 ఇది కూడా చదవండి..పీఎం నరేంద్ర మోడీ ఆరోగ్య రహస్యాలు.. 

 ఇది కూడా చదవండి..బ్యాడ్ కొలెస్ట్రాల్ మందులతో పని లేకుండా తగ్గుతుందా..? అది ఎలా..? 

 

చేతులతో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..  
 
చేతులతో ఆహారాన్ని తినడం ద్వారా, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది, ఈ అలవాటు కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
చేతులతో తినడం ద్వారా అతిగా తినడం మానివేయవచ్చు. బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

 చేతులతో భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు: చేతులతో తినడం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ఈ సంప్రదాయం ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఆయుర్వేదం కూడా దీన్ని అంగీకరించింది. అవసరాన్ని, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు చెంచాలతో తిన్నప్పటికీ, చేతితో తినడానికి అవకాశం ఉన్నప్పుడల్లా, ఈ అవకాశాన్ని వదులుకోకూడదట. ఆయుర్వేదం మనల్ని ప్రకృతితో అనుసంధానం చేయడానికి పనిచేస్తుంది. అందులోభాగంగా వీలైనంతవరకు చెంచాలతో కాకుండా చేతులతో తినడం ఉత్తమమని ఆయుర్వేదవైద్య నిపుణులు చెబుతున్నారు. 

 
1. ఆయుర్వేదం ప్రకారం, చేతులతో ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అనేక పొట్ట సంబంధిత సమస్యలు నయమవుతాయి.

2. ఆయుర్వేదం ప్రకారం, చేతి ఐదు వేళ్లు ఆకాశం (బొటనవేలు), గాలి (చూపుడు వేలు), అగ్ని (మధ్యవేలు), నీరు (ఉంగరపు వేలు), భూమి (చిన్న వేలు) సూచిస్తాయి. చేతులతో తినడం వల్ల శరీరంలోని ఈ ఐదు మూలకాల సమతుల్యతను కాపాడడమేకాకుండా శరీరానికి శక్తి అందుతుంది.
 

3. మన చేతులతో ఆహారాన్ని తాకినప్పుడు, మనం తినడానికి సిద్ధంగా ఉన్నామని మెదడుకు సిగ్నల్ వెళుతుంది, దీని కారణంగా మెదడు అవసరమైన డైజెస్టివ్ ఎంజైమ్‌లను విడుదల చేస్తుంది, ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.

4. చేతులతో భోజనం చేస్తున్నప్పుడు, మనం ఎంత తినాలో, ఏమి తినాలో ఎంత వేగంతో తినాలనే సిగ్నల్ మెదడుకు చేరుతుంది. కాబట్టి ఇవన్నీ జీర్ణక్రియ పనిని సులభతరం చేయడానికి ఉపయోగపడుతాయి.

5. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే, చెంచా వదిలేసి, చేతులతో తినడం అలవాటు చేసుకోవడం మంచిదని ఆయుర్వేద వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే చేతులతో భోజనం చేసేటప్పుడు తినడానికి ముందు, తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి.

 ఇది కూడా చదవండి..జీర్ణశయాంతర క్యాన్సర్స్ ఎన్నిరకాలు..?

 ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.