చేతి పరిశుభ్రత వల్ల ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి..?
సాక్షి లైఫ్ : కోవిడ్ మహమ్మారి ప్రభావవంతమైన హ్యాండ్‌వాష్ ప్రాముఖ్యతను గురించి ప్రపంచదేశాలకు తెలియజేసింది. అయితే చేతులు కడుక్కోవల్సిన అవసరాన్ని గురించి అవగాహన కల్పించేందుకు ఒక రోజు ఉందని మీకు తెలుసా? వ్యాధులను నివారించడానికి సమర్థవంతమైన మార్గం చేతులు కడుక్కోవడం. హ్యాండ్ వాషింగ్ ప్రాముఖ్యతను తెలియచెప్పడానికి అక్టోబర్ 15ని గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డేగా పాటిస్తారు. సబ్బుతో చేతులు కడుక్కోవాలని మరింత మంది వ్యక్తులను ప్రోత్సహించడానికి గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డేను జరుపుతారు.
ఇది కూడా చదవండి..గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డే ప్రాముఖ్యత..
ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోపతి అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?..
ఇది కూడా చదవండి..జాక్‌ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది..?
గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డే చరిత్ర..
సబ్బుతో చేతులు కడుక్కోవడంపై ప్రజలను ప్రోత్సహించడానికి, అవగాహన పెంచడానికి గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డే ని ప్రారంభించారు. మొదటిసారిగా గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డే 2008లో జరిగింది. మొదటి గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డేలో 70 దేశాలలో ప్రపంచవ్యాప్తంగా 120 మిలియన్ల మంది పిల్లలు సబ్బుతో చేతులు కడుక్కోవడం జరిగింది. అప్పటి నుండి, చేతులు కడుక్కోవడం, సింక్‌లు , కుళాయిలు నిర్మించడం ,చేతులు కడుక్కోవాల్సిన అవసరాన్ని గురించి మరింతమందికి ప్రచారం చేయడానికి అక్టోబర్ 15వతేదీన హ్యాండ్ వాషింగ్ డే జరుపుతున్నారు.
ప్రభుత్వాలు, పాఠశాలలు, అంతర్జాతీయ సంస్థలు, ఎన్జీఓ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. టాయిలెట్ ఉపయోగించిన తర్వాత, ఆహారం తినే ముందు, కళ్ళు, నోరు, ముక్కు, చెవులు లేదా ఏదైనా తాకిన తర్వాత సబ్బు నీటితో చేతులు కడుక్కోవాలి. చేతి పరిశుభ్రత వల్ల డయేరియా కేసులు 20 శాతం తగ్గుతాయి. చేతులు శుభ్రంగా కడుకోవడం ద్వారా అనేక ఇన్ఫెక్షన్లు, పలురకాల వైరస్ లను నిరోధించవచ్చు.
ఇది కూడా చదవండి..న్యాచురల్ గా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే..ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
