సాక్షి లైఫ్ : లివర్ ఫెయిల్యూర్ అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇది శరీరంలో అనేక మార్పులను, లక్షణాలను కలిగించి, మీరు అప్రమత్తమవ్వాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. లివర్ పాడవడం వల్ల కనిపించే ముఖ్యమైన లక్షణాలను తెలుసుకోవడం ద్వారా ముందుగా చికిత్స తీసుకోని ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించ వచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.
లివర్ చెడిపోయినప్పుడు,శరీరంలో బిలిరుబిన్ అనే పదార్థం పెరిగిపోతుంది. దీని ప్రభావంతో చర్మం, కళ్లు పసుపు రంగులో కనిపిస్తాయి. ఇది లివర్ పాడవడాన్ని సూచించే ప్రధాన లక్షణం. వాంతులు: లివర్ దెబ్బతినడం వల్ల శరీరంలో అజీర్తి ,మలబద్ధకం, వాంతులు వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. పొట్ట నిండినట్టు అనిపించడం : శరీరంలో వ్యర్థాలు పెరిగితే పొట్ట లేదా కాళ్లలో వాపులు ఉండవచ్చు. ఇది పొట్ట నిండినట్టు అనిపించడం లేదా అలసట కలిగిస్తుంది.అలసట, బలహీనత : లివర్ సమస్యలతో శరీరంలో శక్తి తగ్గుతుంది. నడిచినప్పుడు లేదా పనులు చేసినప్పుడు అలసట, బలహీనతగా అనిపిస్తుంది.
ఇది కూడా చదవండి..ప్రోటీన్ ఫుడ్ దేనికి ప్రయోజనకరం..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి.. పానీపూరీ తయారీలో కృత్రిమ రంగులపై నిషేధం..
ఇది కూడా చదవండి..షవర్మాలో బ్యాక్టీరియా.. తయారీదారులపై చట్టపరమైన చర్యలు..
రక్తస్రావం: లివర్ పని చేయకపోతే, శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రోటీన్లు సరఫరా అవ్వవు. దీని కారణంగా ఒకవేళ చిన్న గాయాలు అయినా ఎక్కువగా రక్తస్రావం జరుగుతుంది. తలనొప్పులు, జ్ఞాపకశక్తి తగ్గడం: లివర్ శరీరంలో విషాలు శుభ్రం చేయడంలో విఫలమవడం వల్ల, తలనొప్పులు, మతిమరుపు, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.గుండె సంబంధిత సమస్యలు : లివర్ పనితీరు దెబ్బతినడంతో గుండెపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల గుండె స్పందనల్లో మార్పులతోపాటు ఊపిరితిత్తులపై కూడా ప్రభావం కనిపిస్తుంది.
తీవ్ర జ్వరం: లివర్ ఫెయిల్యూర్ కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీని కారణంగా జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా ఈ లక్షణాలను గుర్తిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం ముఖ్యం. లివర్ ఫెయిల్యూర్ చాలా ప్రమాదకరమైనది కావచ్చు, కాబట్టి దీని గురించి తెలుసుకుని, సమయానికి చికిత్స తీసుకోవడం ద్వారా సులువుగా లివర్ ఫెయిల్యూర్ సమస్య నుంచి బయటపడొచ్చు. కాబట్టి శరీరంలో ఏమైనా ఇలాంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తే, నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.