నోరోవైరస్ ప్రమాదాకరమా..? 

షేర్ చేయండి:
నోరోవైరస్ ప్రమాదాకరమా..? 

సాక్షి లైఫ్ : నోరో వైరస్ వ్యాధి ఎలా సంక్రమి స్తుందంటే..? నోరోవైరస్ అనేది జూనోటిక్ వ్యాధి. ఈ వ్యాధి కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తులతో ప్రత్యక్ష సంబంధం ద్వారా కూడా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తి మలం, వాంతి ద్వారా వ్యాపిస్తుంది. నోరా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది చాలా అంటువ్యాధి.

 

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?

ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..? 

 

నోరోవైరస్ సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తులలో స్వల్పంగా ఉన్నప్పటికీ, ఇది చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర అంతర్లీన వైద్య పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులకు సోకినట్లయితే అది తీవ్రంగా ఉంటుంది.

 నోరోవైరస్ గ్యాస్ట్రోఎంటెరిటిస్‌కు కారణమయ్యే వైరస్‌ల సమూహం. ఈ వైరస్ కడుపు, ప్రేగుల వాపు, తీవ్రమైన వాంతులు, విరేచనాలకు కారణమవుతుంది. నోరోవైరస్ సోకిన కొన్ని గంటల వ్యవధిలోనే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇది కలుషితమైన నీరు లేదా కలుషితమైన ఆహారం ద్వారా సంభవిస్తుంది. దీనిని స్టమక్ బగ్ అని, స్టమక్ ఫ్లూ అని కూడా అంటారు.  


ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. 

ఇది కూడా చదవండి..మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..

ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.