మధుమేహ నియంత్రణలో నేరేడు గింజల పొడి కీలక పాత్ర..
సాక్షి లైఫ్ : నేరేడు పండ్లు కేవలం రుచికరంగా ఉండటమే కాదు, మధుమేహ నియంత్రణలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో నేరేడు గింజల పొడి ఒక అద్భుత ఔషధంలా పనిచేస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇది ఒక అండర్‌రేటెడ్ సూపర్ ఫుడ్ అని పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
నేరేడు పండులో ఉండే పోషకాలు..
కేలరీలు తక్కువ : ఒక కప్పు నేరేడు పండులో సుమారు 60 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇది బరువు నియంత్రణకు అద్భుతమైన ఎంపిక.పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు : నేరేడు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఇది క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మధుమేహ నియంత్రణ: నేరేడు పండ్లలో ఇన్సులిన్ స్రావాన్ని పెంచే, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియ మెరుగు: నేరేడు పండ్లలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది.
రోగనిరోధక శక్తి పెంపు: విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల నేరేడు పండ్లు రోగనిరోధక శక్తిని పెంచి, అంటువ్యాధుల నుంచి రక్షిస్తాయి. గుండె ఆరోగ్యానికి: నేరేడు పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
