Medical Milestones in 2025 : వైద్య చరిత్రలో 2025 ఆరోగ్య సంరక్షణలో టాప్ ఇన్నోవేషన్స్..!

సాక్షి లైఫ్ : 2025 సంవత్సరం ఆరోగ్య సంరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులకు వేదికైంది. ప్రాణాంతక వ్యాధుల చికిత్స (treatment of life-threatening diseases) నుంచి రోగుల సంరక్షణ విధానాలలో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణల వరకు ఈ ఏడాది వైద్య ప్రపంచం అనేక మైలురాళ్లను అధిగమించింది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI), ఇమ్యునాలజీ, వంధ్యత్వ చికిత్సలలో వచ్చిన టాప్ అడ్వాన్స్ సాంకేతికతలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు.. 

ఇది కూడా చదవండి..Health care : అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందించే చెర్రీస్..

ఇది కూడా చదవండి..Methi side effects : మెంతులు ఎక్కువగా తీసుకున్నా సమస్యే.. 

 
వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి.. 

ఈ ఏడాది వైద్య శాస్త్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి ఆటోఇమ్యూన్ (Autoimmune) వ్యాధుల మూల కారణాన్ని ఛేదించిన ముగ్గురు శాస్త్రవేత్తలకు దక్కింది.

విప్లవాత్మక ఆవిష్కరణ.. 

 డాక్టర్ మేరీ ఇ.బ్రంకో, డాక్టర్ ఫ్రెడ్ రామ్స్‌డెల్ (అమెరికా), డాక్టర్ షిమోన్ సకాగుచి (జపాన్)లు 'రెగ్యులేటరీ టి-సెల్స్ (Tregs)'పై చేసిన పరిశోధనలకు ఈ గౌరవం దక్కింది. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున సొంత కణాలపై దాడి చేయకుండా ఆపే "సెక్యూరిటీ గార్డ్‌లు"గా ఈ Tregs పనిచేస్తాయని వారు నిరూపించారు. ఈ పరిశోధనలు టైప్ 1 డయాబెటిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి తీవ్రమైన ఆటోఇమ్యూన్ రోగాలకు, అలాగే క్యాన్సర్ చికిత్సలు, అవయవ మార్పిడి రంగాల్లో సరికొత్త చికిత్సలకు మార్గం సుగమం చేశాయి.

  AI సాయంతో భారత వైద్య చరిత్రలో మైలురాయి: నెక్స్ట్-జెన్ బయోబ్యాంక్.. 

హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ఏఐ (AI) సాయంతో నడిచే నెక్స్ట్-జెనరేషన్ బయోబ్యాంక్ ప్రారంభం కావడం భారత వైద్య చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా భావించాలి. ఈ బయోబ్యాంక్ ద్వారా నమూనాలను నిల్వ చేయడమే కాకుండా, వాటిని ఏఐ ఆధారిత విశ్లేషణలతో అనుసంధానం చేస్తుంది.ఇది క్యాన్సర్ (oncology), గుండె సంబంధిత (cardiovascular), నాడీ సంబంధిత (neurological diseases) వ్యాధులపై లోతైన అధ్యయనానికి, ముందస్తు నిర్ధారణకు, వ్యక్తిగతంగా వారి సమస్యను బట్టి అందించే చికిత్సల (Personalized Treatment) రూపకల్పనకు సహాయపడుతుంది.

 టెలిమెడిసిన్ 2.0..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తర్వాత పెరిగిన టెలిమెడిసిన్, 2025లో పూర్తి స్థాయి డిజిటల్ హెల్త్‌కేర్ పర్యావరణ వ్యవస్థగా మారింది. ఇది కేవలం వీడియో కన్సల్టేషన్లకు మాత్రమే పరిమితం కాకుండా, రోగులకు వారి మెడికల్ రికార్డులు, ఫాలో-అప్ కేర్ అండ్ రియల్-టైమ్ ఆరోగ్య పర్యవేక్షణను ఇంటి నుంచే అందిస్తోంది.

ధరించగలిగే పరికరాల (Wearable Devices) ద్వారా మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యలను వైద్య నిపుణులు రిమోట్‌గా పర్యవేక్షించగలుగుతున్నారు. దీనివల్ల ఆసుపత్రి సందర్శనలు తగ్గి, చికిత్స మరింత సమర్థవంతంగా మారుతోంది.

 IVF లో ఆధునిక సాంకేతికత : సంతానోత్పత్తిలో భద్రత, కచ్చితత్వం.. 


ఈ ఏడాది 'ప్రపంచ IVF దినోత్సవం' సందర్భంగా, సంతానోత్పత్తి చికిత్స (Fertility Treatment) రంగంలో కొత్త రకం చికిత్సలు అందుబాటులోకి వస్తాయి.పిండానికి ఎటువంటి హాని కలగకుండా పరీక్ష (Non-invasive embryo testing).. పిండానికి ఎటువంటి హాని కలగకుండా దాని ఆరోగ్యాన్ని అంచనా వేసే సరికొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి.

పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ : హార్మోన్ ట్రీట్మెంట్స్ వల్ల దుష్ప్రభావాలు తగ్గి, చికిత్స విజయవంతమయ్యే అవకాశం పెరిగింది. 2025 సంవత్సరం వైద్య రంగంలో మనిషి ఆరోగ్యంపై సమూలమైన ప్రభావం చూపగల సాంకేతికత, పరిశోధనలకు కేరాఫ్‌గా నిలిచింది. ఈ ఆవిష్కరణలు మరింత కచ్చితంగా, సమర్థవంతంగా ఆరోగ్యాన్ని రక్షిస్తాయి.

 

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి.. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?

ఇది కూడా చదవండి..High-Calorie Fruits : అధిక కేలరీస్ ఉండే ఫ్రూట్స్ గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..For stress less life : మెంటల్ స్ట్రెస్ తగ్గించే ఆరోగ్యకరమైన నియమాలు 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : innovation medical-innovation health-innovation digital-healthcare digital-lifestyle health-innovations healthcare-innovation digital-health-mission neonatology-innovations healthcare-innovations medical-innovations-2025 digital-health-trends healthcare-innovations-2025
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com