జాతీయ డెంగ్యూ దినోత్సవం 2025: డెంగ్యూ ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయి..? 

సాక్షి లైఫ్ : దేశవ్యాప్తంగా జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో డెంగ్యూ గురించి అవగాహన పెంచేందుకు ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. వర్షాలు పడడంతో మస్కిటో బ్రీడింగ్‌కు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని చెబుతున్నారు వైద్యులు.

ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..

డెంగ్యూ అంటే ఏమిటి..?

డెంగ్యూ అనేది డెంగ్యూ వైరస్ వల్ల కలిగే తీవ్రమైన జ్వరం. దీనినే "బోన్ బ్రేకింగ్ ఫీవర్ "అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఈ ఫీవర్ వచ్చినప్పుడు తీవ్రమైన నొప్పులు తలెత్తుతాయి.

ప్రధాన లక్షణాలు..  

ఆకస్మికంగా తీవ్రమైన జ్వరం

తల నొప్పి, కంటి వెనుక భాగంలో నొప్పి

మోకాళ్లు, కండరాలు, ఎముకల నొప్పి

చర్మంపై ఎరుపు మచ్చలు

వాంతులు, వికారం

కొన్ని సందర్భాల్లో రక్తస్రావం (నోటి, ముక్కు)

నివారణకు సూచనలు..  

ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ కాకుండా చూడాలి

కాచిన నీటిని మాత్రమే తాగాలి

 చేతులు నిండుగా ఉండేలా బట్టలు ధరించాలి

మస్కిటో రిపెలెంట్లు, నెట్‌లు వాడాలి

కమ్యూనిటీ లెవెల్‌లో ఫాగింగ్‌, పరిశుభ్రతా కార్యక్రమాల్లో పాల్గొనాలి

చికిత్స..  

డెంగ్యూ‌కు నిర్దిష్టమైన యాంటీవైరల్ మందులు లేవు. కానీ, మంచి హైడ్రేషన్, రెస్ట్ తీసుకోవడంతోపాటు చికిత్స ద్వారా నివారణ సాధ్యమవుతుంది. లో బీపీ లేదా ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

 

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : dengue-vaccine dengue dengue-fever immunity dengue-cases dengue-fever-symptoms dengue-control national-dengue-day-2025 dengue-awareness dengue-prevention dengue-symptoms
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com