Hair care : ఖరీదైన ట్రీట్‌మెంట్‌లు అవసరం లేదు.. వంటింటి చిట్కాతో ఒత్తైన కురులు మీ సొంతం..
సాక్షి లైఫ్ : ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి, కాలుష్యం, ఒత్తిడి కారణంగా జుట్టు రాలడం (Hair Fall) అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య. దీని కోసం వేల రూపాయలు ఖర్చు చేసి రకరకాల షాంపూలు, ట్రీట్‌మెంట్‌లు వాడుతుంటారు. కానీ, మన వంటింట్లో దొరికే ఉల్లిపాయతో ఈ సమస్యకు సులభంగా పరిష్కారం చూపవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఎందుకీ ఆనియన్ ఆయిల్..?
ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ (Sulphur) జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషణను అందిస్తుంది. ఇది జుట్టు చిట్లిపోకుండా చూడటమే కాకుండా, తల చర్మంపై రక్త ప్రసరణను పెంచి కొత్త జుట్టు మొలవడానికి సహాయపడుతుంది. అలాగే ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రును నివారిస్తాయి.
ఆనియన్ ఆయిల్ ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు..అదెలా అంటే..?
కావాల్సినవి..రెండు పెద్ద ఉల్లిపాయలు, 200 మి.లీ కొబ్బరి నూనె లేదా ఆముదం. మొదట ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పాత్రలో కొబ్బరి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి చిన్న మంట మీద మరిగించాలి.
ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ లోకి మారి, నూనె పైకి తేలే వరకు ఉంచాలి. ఆ తర్వాత నూనెను చల్లార్చి, వడకట్టి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.
ఎలా వాడాలి మరి..?
వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ నూనెతో తలకు బాగా మసాజ్ చేయాలి. కుదుళ్ల నుంచి చివర్ల వరకు నూనె పట్టించి కనీసం గంట సేపు ఉంచుకోవాలి. ఆపై గాఢత తక్కువగా ఉండే (Mild) షాంపూతో తలస్నానం చేయాలి.
ప్రయోజనాలు ఏంటి..?
జుట్టు రాలడం తగ్గుతుంది,సల్ఫర్ వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి జుట్టు బలంగా మారుతుంది. ఉల్లిపాయలోని ఎంజైమ్స్ జుట్టు చిన్న వయసులోనే తెల్లబడకుండా కాపాడతాయి. క్రమంగా వాడటం వల్ల జుట్టు నిగనిగా మెరుస్తుంది. ఉల్లిపాయ వాసన పడని వారు, ఈ నూనెలో కొద్దిగా రోజ్‌మెరీ లేదా లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కలిపితే మంచి సువాసన వస్తుంది.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
