American Heart Association Latest Guidelines : మొక్కల ఆధారిత ప్రోటీన్లే బెటర్.. కొవ్వు పాలతో జాగ్రత్త..! అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తాజా మార్గదర్శకాలు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల నేపథ్యంలో గుండె జబ్బుల ముప్పు ముంచుకొస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 'అమెరికన్ హార్ట్ అసోసియేషన్' (AHA) తన సరికొత్త పోషకాహార మార్గదర్శకాలను విడుదల చేసింది. మెరుగైన గుండె ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలతో కూడిన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

మాంసం వద్దు.. మొక్కల ఆధారిత ఫుడ్డే ముద్దు..!

మాంసాహారం ద్వారా లభించే ప్రోటీన్ల కంటే మొక్కల ఆధారిత ప్రోటీన్లే గుండెకు మేలు చేస్తాయని నివేదిక వెల్లడించింది. చిక్కుళ్లు, పప్పు ధాన్యాలు, గింజలు (Nuts), విత్తనాలు ప్రాధాన్యత ఇవ్వండి. ఎర్ర మాంసం (Red Meat) వాడకాన్ని వీలైనంత తగ్గించాలి. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే, కొవ్వు తక్కువగా ఉండే 'లీన్ కట్స్' ఎంచుకోవాలి. ప్రాసెస్ చేసిన మాంసానికి దూరంగా ఉండటం మంచిది.

పాల విషయంలో జాగ్రత్త..

సాధారణంగా మనం వాడే 'ఫుల్ ఫ్యాట్' మిల్క్ కంటే, కొవ్వు తీసేసిన (Non-fat) లేదా తక్కువ కొవ్వు ఉన్న (Low-fat) పాల ఉత్పత్తులను వాడాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచించింది. ఇది శరీరంలో అనవసరపు కొవ్వు చేరకుండా కాపాడుతుంది.

ఆ 3 శత్రువుల నుంచి దూరం..!

ఆరోగ్యకరమైన గుండె కోసం చక్కెర, ఉప్పు, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను వీలైనంత పరిమితం చేయాలి. పానీయాల్లో చక్కెరను తగ్గించాలి,
వంటల్లో ఉప్పు వాడకం కనిష్టంగా ఉండాలి. అసంతృప్త కొవ్వులు (Unsaturated fats) ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి.

 పిల్లలకు ఏడాది వయసు వచ్చినప్పటి నుంచే.. 

గుండె ఆరోగ్యకరమైన అలవాట్లు చిన్నప్పటి నుంచే మొదలవ్వాలని, పిల్లలకు ఏడాది వయసు వచ్చినప్పటి నుంచే పోషకాహార క్రమాన్ని అలవాటు చేయడం వల్ల భవిష్యత్తులో గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూడవచ్చని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వివరించింది.

ప్రస్తుత అమెరికా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మార్గదర్శకాలకు భిన్నంగా, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ శాస్త్రీయ దృక్పథంతో ఈ సూచనలు చేసింది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి విడుదల చేసే ఈ మార్గదర్శకాలు గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ముప్పులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన ఆహారంలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని  సొంతం చేసుకోవచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..! 

 ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..? 

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.