Pneumonia Myths and Facts : చిన్నారులు, వృద్ధులను మాత్రమే న్యుమోనియా ప్రభావితం చేస్తుందా..?

సాక్షి లైఫ్ : న్యుమోనియా అనేది ఊపిరితిత్తులను దెబ్బతీసే ఒక రకమైన ఇన్ఫెక్షన్. ఇది ఊపిరితిత్తులలో వాపు ,ద్రవం పేరుకుపోవడానికి కారణమవుతుంది, ఇది శ్వాస సమస్యలకు దారితీస్తుంది. సరైన చికిత్స కోసం, ఈ అనారోగ్యసమస్య గురించి అవగాహన చాలా అవసరం. న్యుమోనియా అపోహలు-వాస్తవాలు తప్పనిసరిగా అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే లేనిపోని అపోహల కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈరోజు వరల్డ్ న్యుమోనియా డే సందర్భంగా సాక్షి లైఫ్ ప్రత్యేక కథనం.. 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

 

న్యుమోనియా తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్..? 

న్యుమోనియా సాధారణ అపోహలు: న్యుమోనియా అనేది వైరస్, బ్యాక్టీరియా లేదా ఫంగస్ వల్ల కలిగే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఈ వ్యాధిలో, ఊపిరితిత్తుల కణజాలం ఎర్రబడి చీము లేదా ద్రవం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది 

కొన్నిసందర్భాలలో, న్యుమోనియా ప్రాణాంతకం కూడా కావచ్చు. అందువల్ల, సరైన చికిత్స కోసం ఈ వ్యాధి గురించి ఖచ్చితమైన సమాచారాన్ని తప్పనిసరిగా తెల్సుకోవాలి.  

అపోహ..న్యుమోనియా వృద్ధులను మాత్రమే ప్రభావితం చేస్తుంది..

నిజం: వృద్ధులకు న్యుమోనియా ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ ఇన్ఫెక్షన్ ఎవరినైనా ప్రభావితం చేస్తుంది, అది పిల్లలు, పెద్దలు లేదా వృద్ధులు అయినా. కాలుష్య కారకాలు, ఇన్ఫెక్షన్లకు గురైన వ్యక్తుల్లో సులభంగా న్యుమోనియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 

అంతేకాదు బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వారు, ఇప్పటికే అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ వ్యాధి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, వృద్ధులకు కూడా ఈ ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అటువంటివారిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. అందువల్ల, వారు న్యుమోనియా సోకకుండా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి.. Fast Food Calorie Chart : ఫాస్ట్ ఫుడ్ తీసుకునే ముందు ఒకసారి క్యాలరీస్ గమనించండి..!

 ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..  

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : lungs-diseases myths-facts lungs-health lung-problems world-pneumonia-prevention-day pneumonia-awareness prevent-pneumonia pneumonia-free-future save-lives-from-pneumonia stop-pneumonia pneumonia-education beat-pneumonia pneumonia-prevention-matters white-lung-pneumonia pneumonia-risk world-pneumonia-day-2025 pneumonia-myths pneumonia-facts pneumonia-in-adults pneumonia-in-children pneumonia-causes pneumonia-prevention pneumonia-symptoms world-pneumonia-day-2025-theme 2025world-pneumonia-day
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com