వాహనాలు, ఫ్యాక్టరీల పొగ వల్ల మరింతగా పెరిగిన కాలుష్యం..
సాక్షి లైఫ్ : సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సిపిసిబి) విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలోని 252 నగరాల ఎయిర్ ఇండెక్స్ తీవ్రస్థాయిలో ఉంది. ఢిల్లీ సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 445 గా ఉంది. ఇది చాలా తీవ్రంగా ఉన్నట్లు లెక్క. దేశంలో బుధవారం ఢిల్లీ మాత్రమే తీవ్రమైన కేటగిరీలో గాలి నాణ్యతను కలిగి ఉంది. దీంతో ఢిల్లీ అత్యంత కలుషితమైన ప్రాంతంగా నిలిచింది.
ఢిల్లీ తర్వాత గురుగ్రామ్ రెండవ స్థానంలో ఉంది, ఇక్కడ కాలుష్యం విపరీతంగా ఉంది. ఎయిర్ ఇండెక్స్ 400గా ఉంది. ఢిల్లీలో ఎయిర్ ఇండెక్స్ రాత్రి 7 గంటలకు 449కి పెరిగింది, ఇది ప్రమాదకరమైన కేటగిరీ కంటే కేవలం రెండు పాయింట్లు తక్కువ. అంతకుముందు నవంబర్ 19న అత్యధికంగా ఎయిర్ ఇండెక్స్ 460గా నమోదైంది. స్విస్ కంపెనీకి చెందిన యాప్ IQAir బుధవారం ఢిల్లీ ఎయిర్ ఇండెక్స్ 459గా నివేదించింది.
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
ఢిల్లీ వాతావరణంలో పిఎం-10 గరిష్ట స్థాయి క్యూబిక్ మీటర్‌కు 393.3 మైక్రోగ్రాములు ఉంది, ఇది సాధారణ ప్రామాణిక స్థాయి కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. పిఎం-2.5 గరిష్ట స్థాయి క్యూబిక్ మీటరుకు 255 మైక్రోగ్రాములు ఉంది. ఇది సాధారణ ప్రామాణిక స్థాయి కంటే నాలుగున్నర రెట్లు ఎక్కువ.
వాహనాలు, ఫ్యాక్టరీల పొగ వల్ల..
IITM పూణే డెసిషన్ స్పోర్ట్ సిస్టమ్ (డిఎస్ ఎస్) ప్రకారం, కాలుష్యంలో వాహన ఉద్గారాలకారణంగా అత్యధికంగా 12.85 శాతం , కర్మాగారాల నుంచి వచ్చే పొగ వల్ల 6.61 శాతం కాలుష్యం పెరిగింది. ఎన్‌సిఆర్ నగరాల్లో ఫరీదాబాద్‌లోని గాలి నాణ్యత దారుణంగానే ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే ఇది చాలా తీవ్రంగా ఉన్నట్లే.
ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?..
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
