సాక్షి లైఫ్ : చిన్నవయసులో వృద్దాప్య లక్షణాలు కనిపించడం అనేది అనేక కారణాల వల్ల జరగవచ్చు. ఈ పరిస్థితి కొంతమంది వ్యక్తులలో చాలా తొందరగా వచ్చేస్తుంది. కొందరిలో అయితే పదేళ్లు దాటకముందే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితికి కారణమయ్యే కొన్ని ప్రధానాంశాలు..ఉన్నాయి..అవేంటంటే..?
జన్యు కారణాలు (Genetic Factors)..
కొన్ని సందర్భాల్లో, వృద్ధాప్య లక్షణాలు జన్యు కారణంగా తలెత్తుతాయి. వృద్దాప్యానికి సంబంధించి జన్యుపరమైన కారణాలు, కొంతమంది వ్యక్తులలో చిన్న వయస్సులోనే శరీరంపై కనిపిస్తాయి. కొన్ని రుగ్మతలు వంశపారంపర్యంగా ఉంటాయి, వీటిలో వృద్ధాప్యం కూడా ఒకటి.