Exercise During Extreme Heat : అధిక ఉష్ణోగ్రతల సమయంలో వ్యాయామం చేయకూడదా..?
సాక్షి లైఫ్ : అధిక ఉష్ణోగ్రతలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా వడగాలుల సమయంలో ఫిట్‌నెస్‌పై మక్కువతో కఠినమైన వ్యాయామాలు చేయడం ఒక్కోసారి ప్రాణసంకటంగా మారవచ్చని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే డీహైడ్రేషన్ , వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ వేసవిలో సురక్షితంగా వర్కవుట్స్ చేయాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..
వ్యాయామం ఎప్పుడు చేయాలి..?
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వ్యాయామం చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, సూర్యోదయానికి ముందే లేదా సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయడం ఉత్తమం.
ఇండోర్ వర్కవుట్స్..
బయట వడగాలులు ఎక్కువగా ఉంటే జిమ్ లేదా ఇంటి లోపల వ్యాయామం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
నీరే ప్రాణాధారం..
వేసవిలో చెమట రూపంలో శరీరం ఎలక్ట్రోలైట్లను కోల్పోతుంది. దీనివల్ల నీరసం వచ్చే అవకాశం ఉంది. వ్యాయామం మొదలు పెట్టడానికి 20 నిమిషాల ముందే రెండు గ్లాసుల నీరు తాగాలి. వ్యాయామం చేస్తున్నప్పుడు కూడా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కొద్దిగా నీరు తీసుకుంటూ ఉండాలి.
ఎలక్ట్రోలైట్స్..
కేవలం మంచి నీరే కాకుండా.. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం లేదా ఓఆర్ఎస్ (ORS) వంటి పానీయాలు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం, పొటాషియం సమతుల్యత దెబ్బతినదు. జిమ్‌కు వెళ్లేటప్పుడు ధరించే దుస్తులు ఈ సీజన్‌లో సౌకర్యవంతంగా ఉండాలి. బిగుతుగా ఉండే దుస్తుల వల్ల గాలి ఆడక శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాటన్ దుస్తులు ధరించడం మేలు.
ముదురు రంగు దుస్తులు వేడిని పీల్చుకుంటాయి. కాబట్టి తెలుపు లేదా ఇతర లేత రంగు దుస్తులను ఎంచుకోండి.
వార్మ్ అప్ తప్పనిసరి..
ఎండల వల్ల కండరాలు త్వరగా అలసిపోతాయి. అందుకే నేరుగా బరువైన వ్యాయామాలు చేయకుండా..
స్ట్రెచింగ్..
కనీసం 10 నిమిషాల పాటు శరీరాన్ని స్ట్రెచింగ్ చేస్తూ వార్మ్ అప్ చేయాలి. వర్కవుట్ పూర్తయిన వెంటనే చల్లటి నీటితో స్నానం చేయకూడదు. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చాకే విశ్రాంతి తీసుకోవాలి.
ఈ సంకేతాలను గమనించండి..!
వ్యాయామం చేస్తున్నప్పుడు తలతిరగడం, వికారం, తలనొప్పి, కండరాల పట్టేయడం లేదా గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వర్కవుట్ ఆపేయాలి. ఇవి వడదెబ్బకు ప్రాథమిక సంకేతాలు కావచ్చు. వెంటనే నీడ పట్టున విశ్రాంతి తీసుకుంటూ వైద్యుడిని సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
