Skip the Lift, Take the Stairs : లిఫ్ట్ తో పనిలేకుండా..మెట్లు ఎక్కడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. ఆఫీసులు, షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, అపార్ట్‌మెంట్లలో కనీసం ఒకట్రెండు అంతస్తులకు వెళ్లాలన్నా లిఫ్ట్‌ (Elevator) పైనే ఆధారపడుతున్నాం. అయితే, ఈ అలవాటు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి శారీరక ఇబ్బందులు, కీళ్ల నొప్పులు లేని వారు లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కడాన్ని (Climbing stairs) అలవాటుగా మార్చుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

మెట్లు ఎక్కడం వల్ల కలిగే లాభాలు..  

గుండె పదిలం.. మెట్లు ఎక్కడం అనేది ఒక అద్భుతమైన కార్డియో వ్యాయామం (Cardio workout). దీనివల్ల హృదయ స్పందన రేటు పెరిగి, శరీరమంతా రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఫలితంగా గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగై దీర్ఘకాలంలో గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.

కేలరీలు కరిగి.. బరువు తగ్గి.. జిమ్‌కు వెళ్లే సమయం లేని వారు మెట్లు ఎక్కడాన్ని వ్యాయామంగా ఎంచుకోవచ్చు. సాధారణ నడక కంటే దీనివల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. శరీర జీవక్రియల (Metabolism) రేటు పెరిగి, అదనపు కొవ్వు కరుగుతుంది. తద్వారా బరువు అదుపులో ఉంటుంది.

కండరాలకు బలం.. మెట్లు ఎక్కేటప్పుడు మన శరీర బరువంతా కాళ్లపై పడుతుంది. ఈ క్రమంలో తొడలు, పిక్కలు, తుంటి కండరాలు బాగా ఉత్తేజితమై దృఢంగా మారుతాయి. శరీర సమతుల్యత (బ్యాలెన్స్) మెరుగుపడటంతో పాటు రోజువారీ పనులు చేసుకోవడం మరింత తేలికవుతుంది.

శారీరక సామర్థ్యం.. 

రోజూ 10 నుంచి 15 నిమిషాల పాటు మెట్లు ఎక్కి, దిగడం వల్ల శారీరక సామర్థ్యం పెరుగుతుంది. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగి, త్వరగా అలసిపోయే సమస్య దరిచేరదు. నిత్యం ఉత్సాహంగా ఉండగలుగుతారు.

మధుమేహానికి చెక్..

భోజనం చేసిన కాసేపటి తర్వాత మెట్లు ఎక్కడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను మన కండరాలు సమర్థవంతంగా వినియోగించుకుంటాయి. తద్వారా షుగర్ లెవల్స్ అమాంతం పెరగకుండా అదుపులో ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు, వృద్ధులు తమ డాక్టర్ సలహా మేరకే ఈ వ్యాయామం చేయాలి.

మానసిక ప్రశాంతత..

మెట్లు ఎక్కడం శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా తోడ్పడుతుంది. ఈ శారీరక శ్రమ వల్ల మెదడులో 'ఎండార్ఫిన్లు' (Endorphins) అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి, మానసిక ఆనందాన్ని పెంచుతాయి. పనిలో ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి. కాబట్టి, వీలైనంత వరకు లిఫ్ట్ వినియోగాన్ని తగ్గించి, మెట్లు ఎక్కడాన్ని మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.

 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.  

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.