శీతాకాలంలో పాల కూర ఎక్కువగా తింటున్నారా..?
సాక్షి లైఫ్ : మీకు తెలుసా..? ఆకుకూరల్లో పోషక విలువలు ఉన్నప్పటికీ ప్రతీ ఒక్కరికీ కావు అనే విషయం..? అవును, శీతాకాలంలో చాలా మంది ఆకుకూర ఎక్కువగా తింటారు. కొన్నిరకాల ఆకుకూరలు చలికాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రయోజనాలకంటే, దుష్ప్రభావాలే ఎక్కువ..శీతాకాలంలో చాలా మంది ఆకుకూరలు తినడానికి ఇష్ట పడుతుంటారు. ఇది ఆరోగ్యానికి మంచిది అయినా, కొన్ని సందర్భాల్లో ఇది హానికరంగా మారవచ్చు.
ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికి తెలుసు. వీటిని ‘పోషకాలకు నిధిగా’ భావిస్తారు. పాల కూర ఎక్కువగా తినడంవల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు మీకు తెలుసా..?
ఇది కూడా చదవండి..స్త్రీలలో క్యాల్షియం లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి ముఖ్యమైన డయాగ్నొస్టిక్ టెస్టులు ఏమిటి..?
కిడ్ని స్టోన్ రిస్క్..
పాలకూరలో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆక్సలేట్, క్యాల్షియం తో కలిసిపోయి కిడ్నీలో రాళ్లను ఏర్పరచే అవకాశం ఉంటుంది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారికి పాలకూరను తీసుకోకపోవడం మంచిది.
జీర్ణ సమస్యలు..
పాలకూరలో అధికంగా ఫైబర్ ఉంటుంది. అధిక ఫైబర్ తీసుకోవడం వల్ల తలనొప్పి, మలబద్ధకం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తవచ్చు.
థైరాయిడ్ సమస్య..
పాలకూరలో గోయిట్రోజెన్ పదార్థాలు ఉంటాయి, ఇవి థైరాయిడ్ గ్రంధి పనితీరును ప్రభావితం చేస్తాయి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు పాలకూర తీసుకోకపోవడమే ఉత్తమం.
కొన్ని మందులపై ప్రభావం..
ఆకుకూరలో విటమిన్ "కె" ఎక్కువగా ఉంటుంది. విటమిన్ కె రక్తం గడ్డకట్టే మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అందువల్ల, రక్తం గడ్డకట్టడానికి మందులు తీసుకుంటున్న వారు పాల కూర పరిమితంగా తీసుకోవాలి.
అలర్జీ ప్రమాదం..
కొంతమంది వ్యక్తులకు ఆకుకూరలు తీసుకోవడం ద్వారా అలర్జీ సమస్యలు తెలెత్తే అవకాశం ఉంది. తిన్న తరువాత తలనొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు ఎదుర్కొవల్సి రావొచ్చు.
ఆకుకూరలో ఉండే ఆక్సలిక్ యాసిడ్, ఫైటేట్స్ అనే పదార్థాలు, శరీరంలో క్యాల్షియం శోషణను అడ్డుకుంటాయి. తద్వారా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాల్షియం కొరత ఏర్పడవచ్చు, ఇది ఎముకల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. మీకు ఎముకల సంబంధిత సమస్యలు ఉంటే, ఆకుకూరలను పరిమితంగా తీసుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి..ఇతర మందులతో పాటు హోమియోపతి మందులు వాడొచ్చా..?
ఇది కూడా చదవండి..2025 న్యూ ఇయర్ లో హెల్తీగా,ఫిట్‌గా ఉండటానికి డబ్ల్యూ హెచ్ఓ 5 ముఖ్యమైన సూచనలు..
ఇది కూడా చదవండి..హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీ ఎలాంటి మహిళలకు అవసరం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
