క్యాన్సర్ రిస్క్‌ను పెంచే పది వస్తువులు.. 

 సాక్షి లైఫ్ : ప్రతిరోజూ మనం తినే ఆహారపదార్థాలు, ఉపయోగించే వస్తువులను గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? మనం నిత్యం వాడే కొన్ని వస్తువులు ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అవి క్యాన్సర్ రిస్క్‌ను పెంచే అవకాశం ఉందని వెల్లడిస్తున్నాయి. మనం ఉపయోగించే వాటిలో రసాయనాలు, హానికరమైన పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలోకి చేరి, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు సృష్టించవచ్చు. మీరు ప్రతిరోజూ ఉపయోగించే పది వస్తువులు క్యాన్సర్ రిస్క్‌ ను ఎలా పెంచుతాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

 
1. కీటకనాశకాలు..   

 ఇంట్లోని బొద్దింకలు, దోమలను చంపడానికివాడే కీటకనాశకాలలో రసాయనాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.

2. నాన్-స్టిక్ కుక్‌వేర్.. 

నాన్-స్టిక్ కిచెన్ వేర్‌లో టెఫ్లాన్ అనే కెమికల్ ఉంటుంది. ఈ పాన్ లను అధిక ఉష్ణోగ్రతలో వేడి చేస్తే, టెఫ్లాన్ గ్యాస్ గా మారుతుంది. దానిని పీల్చడం వల్ల  క్యాన్సర్ రిస్క్‌ పెరుగుతుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
 
3. ప్లాస్టిక్ చాప్పింగ్ బోర్డు.. 

ప్లాస్టిక్ చాప్పింగ్ బోర్డ్స్ ప్రాణాంతకమైన బ్యాక్టీరియా, వైరస్‌లు, కెమికల్స్ ను  కలిగి ఉంటాయి. ఈ బోర్డ్స్ లో కొన్ని చిన్న గరిష్ట భాగాలు మన ఆహారం ద్వారా కడుపులోకి చేరుతాయి. తద్వారా క్యాన్సర్ వంటి మహమ్మారి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. 

 

ఇది కూడా చదవండి..ఇతర మందులతో పాటు హోమియోపతి మందులు వాడొచ్చా..?

ఇది కూడా చదవండి..2025 న్యూ ఇయర్ లో హెల్తీగా,ఫిట్‌గా ఉండటానికి డబ్ల్యూ హెచ్ఓ 5 ముఖ్యమైన సూచనలు.. 

 

ఇది కూడా చదవండి..హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీ ఎలాంటి మహిళలకు అవసరం..?

 

4. ప్లాస్టిక్ వస్తువులు, బాటిళ్ళు.. 

ప్లాస్టిక్ వస్తువులు, బాటిళ్లలో "BPA" (Bisphenol-A) అనే కెమికల్ ఉంటుంది, ఇది రక్తంలోకి చేరి ప్రోస్టేట్ క్యాన్సర్, గుండె సమస్యలు వంటి అనేక వ్యాధుల ప్రమాదం పెంచుతుంది.

5. అల్యూమినియం ఫాయిల్.. 

ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ఉపయోగించే అల్యూమినియం ఫాయిల్‌లో ఉన్న అల్యూమినియం, శరీరంలోపలికి చేరి, ఆక్సిడేటివ్ స్ట్రెస్స్ , క్యాన్సర్ సహా ఇతర సమస్యలను కలిగించవచ్చు.

6. రిఫైండ్ షుగర్.. 

ప్రాసెస్ చేసిన చక్కెర, ఆరోగ్యానికి హానికరమైన ఫ్యాట్ లెవెల్స్ ను పెంచే విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఇన్సులిన్ లెవెల్స్ పెంచి క్యాన్సర్ సెల్స్ పెరగడాన్ని ప్రేరేపిస్తుంది.

7. ఈ-సిగరెట్ - హుక్కా.. 

ఈ-సిగరెట్, హుక్కాలో చాలా రకాల హానికరమైన కెమికల్స్ ఉంటాయి, ఇవి మౌత్ , లంగ్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

8. టీ బ్యాగ్స్.. 

టీ బ్యాగ్స్ లో "ఎపిక్లోరోహైడ్రిన్" అనే కెమికల్ ఉంది, ఇది వేడి నీటితో కలిసిపోతుంది. తద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

9. క్లీనింగ్ ప్రోడక్ట్స్.. 

పలురకాల క్లీనింగ్ ప్రోడక్ట్స్ లో "బెంజీన్", "ఫార్మల్డిహైడ్", "టోల్యూ" వంటి కెమికల్స్ ఉంటాయి. వీటిని ఎక్కువ కాలం వాడడం వల్ల శరీరంపై తీవ్ర ప్రభావం పడి క్యాన్సర్ ప్రమాదం పెరిగే అవకాశం ఉంది.

10. అగరబత్తులు..  
 
అగరబత్తులను కాల్చడం వల్ల వాటిలో ఉండే  రసాయనాలు గాలి లోకి విడుదల అవుతాయి. ఈ రసాయనాలు మనం గాలి పీల్చుకున్నప్పుడు  లోపలికి వెళ్లి, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను కలిగిస్తాయి.

 

ఇది కూడా చదవండి..పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు మీకు తెలుసా..?

ఇది కూడా చదవండి..స్త్రీలలో క్యాల్షియం లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి ముఖ్యమైన డయాగ్నొస్టిక్ టెస్టులు ఏమిటి..?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

 

Tags : stomach-cancer cancer-types breast-cancer cancer-deaths cervical-cancer skin-cancer cancer-treatment prostate-cancer cancer-factors prostate-cancer-factors cancer-cases cancer risk-of-cancer cancer-risk cancer-survivor oral-cancer oral-cancer-symptoms oral-cancer-treatment oral-cancer-risks lung-cancer-treatment cancer-awareness prevent-cancer what-are-the-signs-of-pancreatic-cancer
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com