వర్షాకాలంలో దోమలను తరిమికొట్టే మొక్కలు ఇవే.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వర్షాకాలం ప్రారంభం కాగానే దోమల బెడద పెరుగుతుంది. వర్షం కారణంగా నిలిచిన మురుగు నీటిలో దోమలు వృద్ధి చెందుతాయి, దీని వల్ల మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి ప్రమాదకర వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అందువల్ల, మీ ఇంటి చుట్టూ దోమలను నిరోధించడం చాలా ముఖ్యం. పరిశుభ్రతతో పాటు, కొన్ని మొక్కల సహాయంతో దోమలను తరిమికొట్టవచ్చు. అవేంటో ఇప్పుడు  తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?

ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?

క్యాట్నిప్.. 

దోమలు అసలు ఇష్టపడని కొన్ని మొక్కలలో ఇది ఒకటి. ఈ మొక్క ఎక్కడైనా సులభంగా పెరుగుతుంది. ఈ మొక్క పుదీనా కుటుంబానికి చెందినది. దీని కారణంగా దోమలు వాటి సువాసనకు దూరంగా ఉంటాయి. అందువల్ల, మీరు మీ ఇంటి చుట్టూ ఈ మొక్కలను సులభంగా నాటవచ్చు. అవి చాలా సులభంగా పెరుగుతాయి.
 

రోజ్మేరీ.. 

జుట్టు సంరక్షణ కోసం లేదా ఆహారంలో రోజ్మేరీని ఎక్కువగా ఉపయోగిస్తాం. కానీ దాని కమ్మని వాసన కారణంగా, దోమలు పారిపోతాయి. కాబట్టి మీరు దానిని ఇంట్లో ఒక కంటైనర్ లేదా కుండలో సులభంగా పెంచుకోవచ్చు.

లావెండర్.. 

లావెండర్ సువాసనను చాలామంది ఎక్కువగా ఇష్టపడుతారు,  కానీ దోమలు దాని వాసనకు దూరంగా వెళ్ళిపోతాయి. అవి దాని సువాసనకు పారిపోతాయి. అందువల్ల, మీ ఇంటి చుట్టూ లేదా కిటికీ దగ్గర ఈ మొక్కలను నాటడం వల్ల దోమలు ఇంటిలోపలికి రాకుండా ఉంటాయి. అంతేకాదు దాని సువాసన మీకు బాగా నిద్రపోవడానికి సహాయ పడుతుంది.

నిమ్మ గడ్డి.. 

దోమలు పుల్లని వాసనను ఇష్టపడవు. అందువల్ల, అవి నిమ్మ గడ్డి నుండి కూడా పారిపోతాయి. ఈ మొక్క వాసన నిమ్మకాయలా ఉంటుంది. దీని కారణంగా, కీటకాలు దానికి దూరంగా ఉంటాయి. దోమలు రాకుండా మీరు దానిని మీ ఇంటి వెలుపల నాటవచ్చు.

 బంతి పువ్వు.. 

 బంతి పువ్వు చాలా సులభంగా పెరిగే మొక్క. నారింజ, పసుపురంగులో ఉండే దీని పువ్వులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కానీ దోమలు ఈ మొక్కస్మెల్ ను చూసి పారిపోతాయని మీకు తెలుసా? దోమలు  బంతిపువ్వుల వాసనను ఇష్టపడవు, వాటికి దూరంగా ఉంటాయి. కాబట్టి ఇంటి ఆవరణలో ఈ మొక్కలను నాటడం వల్ల దోమలను వదిలించుకోవచ్చు.

ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. 

ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.