ఎండాకాలంలో తప్పనిసరిగా నివారించాల్సిన సుగంధ ద్రవ్యాలు ఇవే..

షేర్ చేయండి:
ఎండాకాలంలో తప్పనిసరిగా నివారించాల్సిన సుగంధ ద్రవ్యాలు ఇవే..

సాక్షి లైఫ్ : వేసవికాలం దగ్గరపడుతున్న కొద్దీ, ఆరోగ్య సంరక్షణపై అవగాహన మరింత అవసరం. మన భారతీయ వంటకాల్లో సుగంధ ద్రవ్యాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి, కానీ ఎండాకాలంలో వాటిలో కొన్ని శరీరానికి అంతగా మంచిది కాదు. అవి ఆరోగ్య పరంగా ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. సుగంధ ద్రవ్యాలు ఎండాకాలంలో శరీరంపై ఎలాంటి ప్రభావాలు చూస్పిస్తాయంటే..? 

ఇది కూడా చదవండి..బ్రష్ చేసేటప్పుడు టూత్‌పేస్ట్ ఎంత ఉపయోగించాలి..?

ఇది కూడా చదవండి..యాంటీబయాటిక్స్ ఎలా పని చేస్తాయి..?

ఇది కూడా చదవండి..గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే వెల్లుల్లి..

ఏయే సుగంధ ద్రవ్యాలు ఆరోగ్యానికి హానికరంగా ఉంటాయి..?

 
సుగంధ ద్రవ్యాలు భారతీయ వంటకాలలో అంతర్భాగమైన ప్పటికీ, జీర్ణాశయ అసౌకర్యాన్ని నివారించడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవ డానికి వేసవికాలంలో ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎలాంటి సుగంధ ద్రవ్యాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి..? ఎలాంటివి ఆరోగ్యానికి రక్షణగా ఉంటాయనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి.. 

 అల్లం.. 

శరీరంలో వేడిని పెంచేవాటిలో అల్లం ప్రసిద్ధి చెందింది. ఇది శీతాకాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది కానీ వేసవికి తగినది కాదు. అధిక మొత్తంలో అల్లం తీసుకోవడం వల్ల అతిసారం, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా వేడి వాతావరణంలో అల్లం తింటే కడుపులో మంటగా అనిపిస్తుంది. 

 లవంగాలు.. 

లవంగాలలో యూజీనాల్ అనే సమ్మేళనం చాలా వేడిగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. వేడి వాతావరణంలో లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తస్రావం సమస్యలు తీవ్రమవుతాయి. ముఖ్యంగా పిత్త సమస్యలను పెంచుతుంది. కాబట్టి సమ్మర్ సీజన్ లో లవంగాలను తక్కువగా ఉపయోగించడం మంచిది.

 ఇంగువ.. 

 ఇంగువను హింగ్ అని కూడా పిలుస్తారు. దీనిని సాధారణంగా భారతీయ వంటలలో రుచిని పెంచుకోవడానికి, జీర్ణ సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఉపయోగిస్తారు. అయినప్పటికీ దీనిని ఎక్కువగా తింటే పిత్త దోషం (వేడి) ఉన్నవారు వాడకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఇది వేడి సంబంధిత సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.

ఎర్ర కారం..  

ఎండాకాలంలో ఎర్ర కారంపొడి ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్ట, గొంతు, ఛాతీలో మంట వస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను గణనీయంగా పెంచుతుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నపుడు కారం ఎక్కువగా తింటే బాడీలో హీట్ పెంచుతుంది. తద్వారా అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది. 

వెల్లుల్లి.. 

 వెల్లుల్లి బరువు తగ్గడానికి, జీవక్రియను పెంచడంతోపాటు, అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎండాకాలంలో వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది దుర్వాసన, కడుపులో ఆమ్లత్వం ,రక్తస్రావం వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది.

 

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.