ఆరోగ్య బీమా తీసుకోవాలనుకుంటున్నారా..? తప్పనిసరిగా తెసుకోవాల్సిన అంశాలు ఇవే.. 

సాక్షి లైఫ్ : ఆరోగ్య బీమా తీసుకోవాలనుకుంటున్నారా? అయితే హడావుడిగా ఏదో ఒక పాలసీ తీసుకోకుండా, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కొన్ని ముఖ్య విషయాలను తప్పకుండా పరిశీలించాలి. మీరు ఆశించిన సమయంలో బీమా సంస్థ నుంచి సరైన సహాయం అందుకోవాలంటే, ఈ ఐదు అంశాలను తప్పకుండా చెక్ చేయండి.

 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 

- ఏవి కవర్‌ కావో ముందుగానే తెలుసుకోండి: మీరు బీమా తీసుకునే ముందు, పాలసీ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదవండి. బీమా సంస్థ ఏయే వ్యాధులను లేదా చికిత్సలను కవర్‌ చేయదు (ఉదాహరణకు, ఇప్పటికే ఉన్న వ్యాధులు, ప్రెగ్నెన్సీ, దంత సమస్యలు మొదలైనవి) అనే దానిపై స్పష్టమైన అవగాహన ఉండాలి.

- వెయిటింగ్ పీరియడ్స్ గురించి తెలుసుకోండి: కొన్ని రకాల చికిత్సలకు బీమా కవరేజ్ పొందాలంటే, కొంత కాలం వేచి ఉండాల్సి వస్తుంది. ఈ 'వెయిటింగ్ పీరియడ్' ఎంత ఉందో ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా మీరు అనవసరమైన ఇబ్బందులు పడకుండా ముందుగా జాగ్రత్త పడవచ్చు.

- నెట్‌వర్క్ ఆసుపత్రుల జాబితా: మీ ప్రాధాన్యత కలిగిన ఆసుపత్రులు, క్లినిక్‌లు బీమా సంస్థ క్యాష్‌లెస్ నెట్‌వర్క్‌లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో మీ దగ్గర్లోని ఆసుపత్రిలో క్యాష్‌లెస్ సదుపాయం ఉంటే, క్లెయిమ్ చేసుకోవడం సులభం అవుతుంది.

-రెన్యూవల్ నిబంధనలు: మీరు తీసుకునే బీమా పాలసీ జీవితకాలం రెన్యూవల్ చేసుకోవచ్చా లేదా అని చూసుకోండి. అలాగే, సమయానికి ప్రీమియం చెల్లిస్తూ, పాలసీని యాక్టివ్‌గా ఉంచుకోవాలి. 

 క్లెయిమ్ ప్రాసెస్: బీమా తీసుకునే ముందు క్లెయిమ్ చేసుకునే విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి. క్లెయిమ్ చేయడానికి ఏయే పత్రాలు అవసరమో,  ఆన్‌లైన్‌లో సులభంగా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందో లేదో తెలుసుకోండి. సరళమైన క్లెయిమ్ ప్రక్రియ కలిగిన బీమా సంస్థను ఎంచుకోవడం మంచిది.

 

ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..? 

ఇది కూడా చదవండి..న్యూరోసర్జన్లు వెన్నెముక శస్త్రచికిత్స చేయడానికి కూడా అర్హులే

ఇది కూడా చదవండి..పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : health-insurance-new-rules health-insurance health-insurance-policy health-insurance-policyholders insurance-claim-rejection health-insurance-tips buying-health-insurance-guide what-to-check-before-buying-insurance important-factors-for-health-insurance choosing-a-health-insurance-plan health-insurance-policy-checklist tips-for-buying-health-insurance-in-india how-to-select-health-insurance health-insurance-for-beginners understanding-health-insurance-policy
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com