డెంగ్యూ, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధులు రాకుండా చిట్కాలు..

షేర్ చేయండి:
డెంగ్యూ, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధులు రాకుండా చిట్కాలు..

సాక్షి లైఫ్ : వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, డయేరియా, గ్యాస్ట్రోఎంటెరిటిస్, ఫుడ్ పాయిజనింగ్ , ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధుల పట్ల అజాగ్రత్తగా ఉంన్నా లేదా చికిత్సలో ఆలస్యం చేసినా సమస్య తీవ్రమవుతుంది. అందుకే మాన్ సూన్ సీజన్‌లో తీవ్రమైన వ్యాధులు రాకుండా ఉండాలంటే..?  ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?

ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..? 

డెంగ్యూ , మలేరియా..

డెంగ్యూ , మలేరియా మాత్రమే కాదు, ఇతర తీవ్రమైన వ్యాధుల ప్రమాదం వర్షాకాలంలో పెరుగుతుంది. ఈ సీజన్ లో వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి నీరు తాగడం వల్ల  జ్వరం, గొంతు నొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆహారపు అలవాట్లతోపాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

వ్యాధులు వచ్చే ప్రమాదం.. 
 
రెయినీ సీజన్‌లో అనేక సమస్యలు వస్తాయి. రోడ్లు, ఇళ్లలో నీరు చేరడం వల్ల దోమలు విపరీతంగా పెరుగుతాయి. దోమ కాటు వల్ల డెంగ్యూ, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. జలుబు, ఫ్లూతో పాటు కడుపు సంబంధిత వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి 
ఈ సీజన్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అదనపు జాగ్రత్తలు అవసరమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

తీవ్రమైన వ్యాధులు.. 

 "వర్షాకాలంలో, జ్వరం, గొంతు నొప్పి, కడుపు నొప్పితోపాటు ఇతర సమస్యల నుంచి వివిధ లక్షణాలలో సాధారణంగా 60% వరకు పెరుగుదల కనిపిస్తుంది. ఈ కాలంలో ఈ సమస్యలు చాలా సాధారణం ఇలాంటి వ్యాధులను నివారించడానికి, నివారణ చర్యలు తీసుకోవడం తోపాటు వాటిని సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం. తద్వారా ఆయా తీవ్రమైన వ్యాధుల నుంచి సులువుగా బయటపడొచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. 

తాగునీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని బాగా మరిగించి, కాచి వడపోసి తాగడం వల్ల క్రిమికీటకాలు చనిపోతాయి. తద్వారా కొంతమేర ఆరోగ్యంగా ఉండొచ్చు. దోమలు దరిచేరకుండా అవసరమైన చర్యలు చేపట్టాలి. దీనివల్ల డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా వంటివి రాకుండా ఉంటాయి. 

ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. 

ఇది కూడా చదవండి..మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..

ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.