సాక్షి లైఫ్ : నేటి ఆధునిక జీవనశైలిలో చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance). ఇది టైప్ 2 మధుమేహం (Type 2 Diabetes)కు ప్రధాన కారణం. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణ తప్పకుండా ఉండటానికి, ఇన్సులిన్ పనితీరు మెరుగుపడటానికి ఒక ముఖ్యమైన పోషకం అద్భుతంగా పనిచేస్తుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆ పోషకమే... విటమిన్ డి (Vitamin D).
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి.. హోమియోపతి వైద్యంలో క్యేన్సర్ కు చికిత్స ఉందా..?
విటమిన్ డి లోపం ఉన్నవారిలో ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉంటుందని విస్తృత అధ్యయనాలు నిరూపించాయి. ముఖ్యంగా ఊబకాయం (Obesity), మెటబాలిక్ సిండ్రోమ్ (Metabolic Syndrome) మరియు టైప్ 2 మధుమేహం ఉన్నవారిలో ఈ 'డి విటమిన్' స్థాయిలు తక్కువగా ఉంటున్నాయి.
కణాల స్పందన మెరుగు..
విటమిన్ డి కణాలలో ఇన్సులిన్ సిగ్నలింగ్‌ను మెరుగుపరుస్తుంది, తద్వారా కణాలు రక్తంలోని గ్లూకోజ్‌ను సమర్థవంతంగా గ్రహిస్తాయి. ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తిని కూడా ఇది పరోక్షంగా బలపరుస్తుంది. ఇన్సులిన్ నిరోధకతకు కారణమయ్యే వాపు (Inflammation) కొవ్వు కణజాలంలో ఫైబ్రోసిస్‌ను తగ్గించడంలో విటమిన్ డి సహాయపడుతుంది.
విటమిన్ డి ని పెంచుకునే మార్గాలు..
ప్రతిరోజూ 10 నుంచి 20 నిమిషాలు సూర్యరశ్మిలో గడపడం ఉత్తమం. కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు, గుడ్లు, ఫోర్టిఫైడ్ పాలు, పెరుగు వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి.విటమిన్ డి శరీరంలో సరిగ్గా జీర్ణం కావడానికి మెగ్నీషియం (Magnesium) చాలా అవసరం. అందుకే, మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఆహారాలు నట్స్, ఆకు కూరలు తీసుకోవాలి.
విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవాలనుకుంటే, తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి, వారి పర్యవేక్షణలో మాత్రమే సరైన మోతాదును నిర్ణయించుకోవాలి. కేవలం ఆహారం లేదా సప్లిమెంట్ల ద్వారా మాత్రమే కాక, సరైన వ్యాయామం, బరువు నియంత్రణ ద్వారా కూడా ఇన్సులిన్ నిరోధకతను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
ఇది కూడా చదవండి..Beat the Winter Blues : వింటర్ బ్లూస్ కు చెక్ పెట్టండి.. మానసిక ఉల్లాసాన్ని పెంచుకోండిలా..!
ఇది కూడా చదవండి..Hot Yoga : హాట్ యోగా ఎలాంటి వాళ్లు చేయకూడదు ఎందుకు..?
ఇది కూడా చదవండి..Acanthosis Nigricans : అకాంథోసిస్ నైగ్రికన్స్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. మానసిక సమస్యలకు పరిష్కారాలేంటి..?
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com