Cumin Seeds (Jeera): జీలకర్రతో అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు..!

సాక్షి లైఫ్ : భారతీయ వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాలు కేవలం వంటకాలకు రుచిని ఇవ్వడానికే కాదు, అవి ఆరోగ్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తాయి. అలాంటి సుగంధ ద్రవ్యాలలో ముఖ్యమైనది - జీలకర్ర (Jeera). అవును, ఇవి మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి ఇంటి చిట్కాలలో ముఖ్యమైన భాగం. దీని అద్భుతమైన ప్రయోజనాలను గురించి (Cumin Benefits) తెలిస్తే అస్సలు వదలరు..

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

 

జీలకర్ర ఎందుకు అంత ప్రయోజనకరం అంటే..?

 జీర్ణవ్యవస్థకు నిజమైన నేస్తం..!

జీర్ణవ్యవస్థకు జీలకర్ర ఒక వరం లాంటిది. అజీర్ణం, గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉంటే, జీలకర్ర దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను చురుకుగా మారుస్తుంది, తద్వారా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. భోజనం తర్వాత చిటికెడు వేయించిన జీలకర్ర నమలడం లేదా జీలకర్ర నీరు తాగడం తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

 బరువును తగ్గించడంలో..  

మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, జీలకర్రను మీ డైట్‌లో చేర్చుకోవడం తప్పనిసరి. జీలకర్ర శరీరంలోని మెటబాలిజం (Metabolism)ను వేగవంతం చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే, శరీరంలో కొవ్వు (Body Fat) వేగంగా తగ్గుతుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని ఇవ్వడమే కాకుండా, శరీరంలోని విషపదార్థాలను (Toxins) బయటకు పంపడానికి కూడా సహాయపడుతుంది.

 సమృద్ధిగా ఐరన్..!

శరీరానికి చాలా అవసరమైన ఐరన్ (Iron) జీలకర్రలో సమృద్ధిగా లభిస్తుంది. ఐరన్ లోపం వల్ల తరచుగా అలసట, బలహీనత వంటివి వస్తాయి. దీనిని అనీమియా (రక్తహీనత) అంటారు. ముఖ్యంగా ఐరన్ లోపంతో బాధపడే మహిళలకు, జీలకర్ర క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తహీనతను తగ్గించి, శరీరంలో శక్తిని నిలపడానికి బాగా ఉపయోగపడుతుంది.

 మంచి నిద్రకు..!

జీలకర్ర నిద్రలేమి (Insomnia) లేదా నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుందని అనేక పరిశోధనలలో తేలింది. ఇందులో ఉండే కొన్ని నూనెలు, సమ్మేళనాలు మనస్సును ప్రశాంతపరుస్తాయి, అంతేకాదు ఒత్తిడిని తగ్గిస్తాయి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో జీలకర్ర పొడి కలిపి తాగితే, గాఢమైన నిద్ర పట్టడానికి అవకాశం ఉంటుంది.

మెరిసే చర్మం కోసం..

జీలకర్రలో విటమిన్ "ఇ" యాంటీఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి, ఇవి మీ చర్మానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. ఇందులో ఉండే  "ఇ" యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ-రాడికల్స్ నుంచి రక్షిస్తుంది, కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమలు (Acne),చర్మపు మంటను కూడా తగ్గిస్తాయి.

జీలకర్రను ఎలా ఉపయోగించాలి..?

ఒక చెంచా జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం మరిగించి తాగాలి. జీలకర్రను వేయించి, పొడి చేసి పెరుగు లేదా మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు.

పోపు లేదా తాలింపు.. 

 పప్పు, కూరగాయలలో పోపు వేయడానికి దీనిని రోజూ ఉపయోగించవచ్చు. జీలకర్ర ఒక సహజమైన అద్భుతగుణాలు కలిగిన  ఔషధం. దీనిని ప్రతిరోజూ తీసుకుంటే పలు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు..  

 

ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : stress digestion digestive digestive-foods digestive-problems cumin digestive-system probiotics-for-digestive-health digestive-health digital-detox digestion-problems digestive-problems-instant-relief cumin-health-benefits
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com