Obesity and cancer : ఊబకాయానికి, క్యాన్సర్‌కు ఏంటి లింక్..? 

సాక్షి లైఫ్ : ఊబకాయం (Obesity) కేవలం గుండె జబ్బులతోపాటు మధుమేహం (Diabetes) వంటి దీర్ఘకాలిక సమస్యలకే కాక, అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధికి కూడా ప్రధాన కారణమవుతుందని ప్రపంచ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక బరువుకు, వివిధ రకాల క్యాన్సర్లకు మధ్య ఉన్న"సైలెంట్ లింక్"ను తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అత్యవసరం. 

 

ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..? 

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

క్యాన్సర్ ప్రమాదంలో ఊబకాయం పాత్ర.. 

పొగాకు వాడకం తర్వాత, క్యాన్సర్ ప్రమాద కారకాలలో ఊబకాయం రెండవ స్థానంలో ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో దాదాపు 4 శాతం నుంచి 8 శాతం వరకు ఊబకాయం కారణంగానే వస్తున్నాయని అంచనా వేస్తున్నారు పరిశోధకులు. 

ఊబకాయం పెంచే క్యాన్సర్ రకాలు..

రొమ్ము క్యాన్సర్ ,మెనోపాజ్ తర్వాత మహిళల్లో పెద్దప్రేగు, పురీషనాళం (Colorectal) క్యాన్సర్ గర్భాశయం (ఎండోమెట్రియల్) క్యాన్సర్, కాలేయం (Liver), కిడ్నీ క్యాన్సర్, ప్రాంక్రియాస్ క్యాన్సర్, అన్నవాహిక (Esophageal Adenocarcinoma) క్యాన్సర్, పిత్తాశయం, థైరాయిడ్, మైలోమా వంటివి.

 (Decoding the Silent Link)శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వు  ముఖ్యంగా బొడ్డు చుట్టూ ఉండే విసరల్ ఫ్యాట్, క్యాన్సర్ కణాల పెరుగుదలకు నేరుగా దోహదపడుతుంది. 

 హార్మోన్ల అపసవ్యత (Hormone Imbalance):కొవ్వు కణాలు అధిక మొత్తంలో ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. 

మహిళల్లో, ఈ అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతాయి.

దీర్ఘకాలిక మంట (Chronic Inflammation).. 

కొవ్వు కణజాలం శరీరంలో నిరంతరంగా, తక్కువ స్థాయిలో మంట (Inflammation) ను ప్రేరేపిస్తుంది. ఈ దీర్ఘకాలిక వాపు కణాల DNAను దెబ్బతీసి, క్యాన్సర్ కణాలు ఏర్పడటానికి మార్గం సుగమం చేస్తుంది. 

ఇన్సులిన్ స్థాయిల పెరుగుదల (High Insulin Levels).. 

ఊబకాయం వల్ల ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance) పెరుగుతుంది. దీని ఫలితంగా రక్తంలో ఇన్సులిన్ IGF-1 (ఇన్సులిన్ లాంటి గ్రోత్ ఫ్యాక్టర్-1) స్థాయిలు పెరుగుతాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్లు క్యాన్సర్ కణాల విభజనను, పెరుగుదలను ఉద్దీపన చేస్తాయి.

 ఏం చేయాలి..?

ఊబకాయం, దాని సంబంధిత క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడానికి అత్యంత ముఖ్యమైన చర్య బరువును ఆరోగ్యకరమైన స్థాయిలో నిర్వహించడం. అందుకోసం సమతుల్య ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, రెడ్ మీట్, చక్కెర పానీయాలకు దూరంగా ఉండాలి. 

ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ చేయడం లేదా వారానికి 150 నిమిషాల ఏరోబిక్ వ్యాయామం తప్పనిసరి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా ఈ నిశ్శబ్ద ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

 

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?


 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : breast-cancer cancer-deaths obesity-problems obesity cancer-factors obesity-research childhood-obesity
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com