సాక్షి లైఫ్ : సాధారణంగా దంత సమస్యల నుంచి ఉపశమనం కోసం చేసే చికిత్స.. గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వంటి ప్రమాదకరమైన రోగాలను కూడా నివారించవచ్చని కొత్త అధ్యయనాలు సూచిస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజమే..! దంతాలలోని ఇన్‌ఫెక్షన్లను (Infections) చికిత్స చేయడం ద్వారా శరీరంలో వాపు (Inflammation) తగ్గుతుంది. ఈ వాపు తగ్గడం వల్లనే గుండె, మధుమేహం (Diabetes) వంటి దీర్ఘకాలిక సమస్యల ముప్పు గణనీయంగా తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఆ అద్భుత చికిత్స ఏంటంటే...?
ఆరోగ్య నిపుణుల దృష్టిని ఆకర్షిస్తున్న ఆ ప్రముఖ దంత చికిత్స మరేదో కాదు.. రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ (Root Canal Treatment - RCT). సాధారణంగా దంతం లోపల ఉన్న నాడి (పల్ప్) ఇన్‌ఫెక్షన్ బారిన పడినప్పుడు లేదా వాపు వచ్చినప్పుడు దంతాన్ని కాపాడటానికి ఈ చికిత్స చేస్తారు. ఈ చికిత్స ద్వారా దంతం చివర ఉండే ఇన్‌ఫెక్షన్‌ను అంటే అపికల్ పీరియాంటైటిస్ ను తొలగించడం వల్ల శరీరంలో దీర్ఘకాలికంగా ఉండే వాపు ప్రక్రియ తగ్గుతుంది.
గుండె జబ్బులకు లింక్..
ఇన్ఫెక్షన్ దంతాల నుండి వచ్చే బ్యాక్టీరియా రక్తంలోకి ప్రవేశించి, నిరంతరంగా వాపును ప్రేరేపిస్తుంది. ఈ వాపు రక్తనాళాలపై ఒత్తిడి పెంచి గుండె జబ్బులకు కారణమవుతుంది. రూట్ కెనాల్ చికిత్సతో ఇన్‌ఫెక్షన్‌ను తొలగించినప్పుడు, గుండె సమస్యల ప్రమాదాన్ని సూచించే hs-CRP (సి-రియాక్టివ్ ప్రొటీన్) స్థాయిలు తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది.
మధుమేహంపై ప్రభావం..
నోటి ఇన్‌ఫెక్షన్లు ఇన్సులిన్ నిరోధకతను (Insulin Resistance) పెంచి, రక్తంలో చక్కెర నియంత్రణను (Blood Sugar Control) దెబ్బతీస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. రూట్ కెనాల్ ద్వారా ఇన్‌ఫెక్షన్‌ను తొలగించడం వలన శరీరంలోని వాపు తగ్గి, చక్కెర స్థాయులు మెరుగైన నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మధుమేహం,గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ ఒక అదనపు ప్రయోజనంగా చూడాలి. అంతేకానీ, ఇది పూర్తి నివారణ కాదని గుర్తుంచుకోవాలి.
నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి: ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో ఉదయం, రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయాలి. ఫ్లాసింగ్ (Flossing): దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని తొలగించడానికి డెంటల్ ఫ్లాస్ వాడటం మంచిది. ఏ సమస్య లేకున్నా ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్‌ను సంప్రదించాలి. మీకు దంతాలలో నొప్పి లేదా ఇన్‌ఫెక్షన్ లక్షణాలు ఉంటే వెంటనే దంత వైద్యుడిని సంప్రదించడం మీ నోటి ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి, మధుమేహ నియంత్రణకు చాలా అవసరం.
ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com