సాక్షి లైఫ్ : వీగన్లు పాల ఉత్పత్తులు, తేనె వంటి వాటికి దూరంగా ఉంటారు. మొక్కల నుంచి లభించే పదార్థాలను మాత్రమే తీసుకుంటారు. ఇటీవల తలెత్తుతున్న అనారోగ్య సమస్యల కారణంగా జనాలు తమ జీవనశైలిని నెమ్మదిగా మార్చుకుంటున్నారు. అందులో భాగంగానే చాలామంది వీగన్స్‌గా మారిపోతున్నారు. ఈమధ్య వీగన్ డైట్‌ను పాటించే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. అయితే వీగన్ డైట్ వల్ల ఏమేం ప్రయోజనాలున్నాయి..? ఏమేం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..కొవ్వు కాలేయం కోసం ఏ ఆయుర్వేద మూలికలు, నివారణలు సిఫార్సు చేస్తారు..?
ఇది కూడా చదవండి..పంచదార క్యాన్సర్ ప్రమాదాన్నిపెంచుతుందా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ అంటువ్యాధా..? కాదా..?
సోషల్ మీడియాలో ప్రచారం పెరగడం, ఈ కొత్త రకం డైట్ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండడం, సెలబ్రిటీలు కూడా వీగన్స్‌గా మారిపోతుండటంతో చాలామంది ఈ డైట్‌ను ఫాలో అవుతున్నారు.
శాకాహారాన్ని ప్రోత్సహిస్తూ..
జంతువులకు హానీ చేయకుండా, శాకాహారాన్ని ప్రోత్సహిస్తూ ఈ మధ్య అందరూ వీగన్స్‌గా మారుతున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ డైట్‌ను ఫాలో అవుతున్నారు.
1944 నవంబర్ నెలలో ది వీగన్ సొసైటీని డొనాల్డ్ వాట్సన్ ఏర్పాటు చేశాడు. వీగన్, వీగనిజమ్ అనే పదాలు పుట్టింది కూడా అప్పుడే. వీగన్ డైట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే పూర్తిగా శాఖాహార పదార్థాలనే తీసుకోవడం. జంతు సంబంధిత ఆహార పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటూ, కేవలం వృక్ష సంబంధిత ఆహారాలను తీసుకోవడం ఈ డైట్ ప్రధాన ఉద్దేశం.
కేవలం మొక్కల ద్వారా లభించే..
ఇక వీగనిజం పాటించే వాళ్లు ముఖ్యంగా కఠినమైన ఆహార పద్దతులను పాటిస్తారు. కేవలం మొక్కల ద్వారా లభించే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. పాలపదార్థాలు గానీ, జంతువుల నుంచి వచ్చే ఏ ఆహారాన్ని తీసుకోరు. కానీ వాటికి ప్రత్యామ్నాయంగా ఆహారంలో పోషక విలువలు తగ్గకుండా జాగ్రత్తలు వహిస్తారు. పాలకు బదులుగా పల్లీలనుంచి తీసిన పాలు, కొబ్బరి, జీడిపప్పుతో చేసిన ఛీజ్ కేక్ లాంటివి తిని పోషకాహార లోపాన్ని అధిగమిస్తారు.
వీగన్లు తాము వేసుకునే దుస్తుల్లోనూ జంతు సంబంధమైనవి లేకుండా కేవలం లెనిన్, కాటన్‌తో రూపొందిన దుస్తులకే ప్రాధాన్యత ఇస్తారు. చలిని తట్టుకోవడానికి మనం ధరించే కోట్లు, బెల్టులు, టోపీల తయారికి లక్షల కొద్ది మూగజీవుల్ని వధిస్తున్నారనే కారణంతోనే వీగన్లు.. ఈ దుస్తులను నిషేధిస్తున్నారు.
జంతు చర్మంతో తయారవుతున్న ఉత్పత్తులకు బదులుగా కృత్రిమ నార, సోయా ఉత్పత్తులు, రీసైకిల్డ్ నైలాన్, కార్డ్ బోర్డులతో రూపొందిన దుస్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అమీర్ ఖాన్, కంగనా రనౌత్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ, శ్రద్ధా కపూర్ వంటి సెలబ్రిటీలు సైతం కొన్నేళ్లుగా వీగన్స్‌గా మారి అలాంటి డైట్‌ను ఫాలో అవుతున్నారు.
ఫ్యాట్ కంటెంట్..
పూర్తి శాకాహారాన్ని అనుసరించడం వల్ల చక్కెర స్థాయిలను, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. ఎందుకంటే ఈ తరహా ఆహారాలు సంతృప్త కొవ్వులో తక్కువగా, ఫైబర్‌ను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఫ్యాట్ కంటెంట్ ఉండదు కాబట్టి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తూ బరువు కూడా కంట్రోల్‌లో ఉంటుంది.
వీగన్ డైట్‌తో దుష్ప్రభావాలు..
- వీగన్స్‌లో ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ B12 పోషకాల లోపం ఉండే అవకాశం ఉంది.
-వీగన్ డైట్‌తో ఎన్నో లాభాలున్నప్పటికీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వీగన్ ఫుడ్ తీసుకునేవారికి ఐరన్ సమస్యలు వచ్చే అవకాశముంది.
- చాలా మంది శాకాహారులు ఐరన్ లోపంతో రక్తహీనతకు గురయ్యే ప్రమాదం ఉంది.
నాన్ వెజిటేరియన్స్, వీగన్స్ ఎవరైనా సరే.. ఎలాగ మారినా తమ శరీర తత్వాన్ని బట్టి డైట్‌ను ఫాలో అవ్వాలి. శృతి మించితే లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కు కీమోథెరపీతో చికిత్స చేయవచ్చా..?
ఇది కూడా చదవండి..చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com