Auto-Brewery Syndrome : ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అంటే ఏమిటి..?

సాక్షి లైఫ్ : రోజంతా ఆరోగ్యకరమైన ఆహారం తిన్నా, ఒక్క చుక్క మద్యం ముట్టకపోయినా.. సాయంత్రానికి కొందరు తాగుబోతుల్లా ప్రవర్తిస్తుంటారు. మాట తడబడటం, నడకలో తూలడం వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతుంటారు. పైకి చూసేవారికి వీరు ‘రహస్యంగా’ తాగుతున్నారని పించినా, అసలు కారణం వారి శరీరంలోనే దాగి ఉంది. దీనినే వైద్య పరిభాషలో ‘ఆటో బ్రూవరీ సిండ్రోమ్’ (ABS) లేదా ‘గట్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్’ అని పిలుస్తారు.

ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..? 

ఇది కూడా చదవండి.. హోమియోపతి వైద్యంలో క్యేన్సర్ కు చికిత్స ఉందా..?

 

ఏమిటీ వింత వ్యాధి..?

సాధారణంగా మనం తీసుకున్న ఆహారం జీర్ణక్రియలో భాగంగా శక్తిగా మారుతుంది. అయితే ఈ సమస్య ఉన్నవారిలో ఆహారంలోని పిండి పదార్థాలు (Carbohydrates), చక్కెరలు జీర్ణాశయంలోని కొన్ని రకాల బ్యాక్టీరియా, ఫంగస్ (Yeast) వల్ల పులిసిపోయి (Fermentation) నేరుగా ఆల్కహాల్‌గా మారిపోతాయి. అంటే.. వారి పొట్టే ఒక ‘మద్యం తయారీ కేంద్రం’ (Brewery)లా మారుతుందన్నమాట. ఈ ఆల్కహాల్ రక్తంలో కలవడంతో వారు మద్యం తాగకుండానే మత్తులోకి జారుకుంటారు.

తాజా పరిశోధన ఏం చెబుతోంది..?

ఇటీవల నేచర్ మైక్రోబయాలజీ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, ఈ సమస్యకు ప్రధాన కారణం మన పేగుల్లో ఉండే క్లెబ్సియెల్లా న్యుమోనియే (Klebsiella pneumoniae), ఈ-కోలై (E. coli) వంటి బ్యాక్టీరియాలేనని శాస్త్రవేత్తలు గుర్తించారు.

సాధారణ వ్యక్తులతో పోలిస్తే, ఏబీఎస్ బాధితుల్లో ఈ బ్యాక్టీరియాల శాతం అత్యధికంగా ఉంటోంది. ఇవి పిండి పదార్థాలను అత్యంత వేగంగా ఇథనాల్‌గా మారుస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీరి మల నమూనాలను పరీక్షించినప్పుడు, సాధారణ వ్యక్తుల కంటే వెయ్యి రెట్లు అధికంగా ఆల్కహాల్ ఆనవాళ్లు కనిపించడం గమనార్హం.

ఎవరికి ప్రమాదం..?

ఈ పరిస్థితి చాలా అరుదైనదే అయినా.. కొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా మారుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. యాంటీబయోటిక్ వాడకం: సుదీర్ఘకాలం యాంటీబయోటిక్స్ వాడటం వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియా నశించి, ఇలాంటి హానికర బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండేవారిలో ఈ ఫెర్మెంటేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. క్రోన్ వ్యాధి వంటి సమస్యలు ఉన్నవారిలోనూ ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి.

లక్షణాలు ఎలా ఉంటాయి..? 

కారణం లేకుండా మత్తుగా అనిపించడం. తల తిరగడం, వికారం, తీవ్రమైన తలనొప్పి. మానసిక స్థితిలో మార్పులు అంటే..? చిరాకు, గందరగోళంగా అనిపించడం. నోటి నుంచి ఆల్కహాల్ వాసన రావడం.

పరిష్కారం ఏమిటి మరి..?

వైద్యుల పర్యవేక్షణలో యాంటీ-ఫంగల్ మందులు వాడటం ద్వారా దీనిని నియంత్రించవచ్చు. ప్రధానంగా ఆహారంలో పిండి పదార్థాలను తగ్గించి, ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  

 

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

  ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..? 

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : gut-health gut-bacteria alcohol alcohol-and-health autophagy auto-brewery-syndrome gut-fermentation-disorder body-produces-alcohol causes-of-intoxication digestive-disorders
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com