Latest Research: తాజా పరిశోధన : స్మార్ట్‌ఫోన్.. పురుషుల్లో సంతానలేమికి కారణమవుతుందా..?

షేర్ చేయండి:
Latest Research: తాజా పరిశోధన : స్మార్ట్‌ఫోన్.. పురుషుల్లో సంతానలేమికి కారణమవుతుందా..?

సాక్షి లైఫ్ : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో స్మార్ట్‌ఫోన్ అనేది శరీరంలో ఒక భాగమైపోయింది అంటే..? అతిశయోక్తి కాదు.. అయితే, చాలామంది పురుషులు స్మార్ట్ ఫోన్‌ను ప్యాంటు జేబులోనే ఉంచుతారు. దీనివల్ల వెలువడే రేడియో ధార్మిక తరంగాలు పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయనే ప్రచారం చాన్నాళ్లుగా సాగుతోంది. అయితే, దీనిపై స్పష్టమైన ఆధారాలు లేవని, ఆందోళన చెందాల్సిన పనిలేదని అమెరికాలోని ఉటా హెల్త్ యూనివర్సిటీకి చెందిన ప్రఖ్యాత ఆండ్రాలజిస్ట్ డాక్టర్ జేమ్స్ హోటలింగ్ పేర్కొంటున్నారు.

 

ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ ఎంత ఉండాలి..?

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి.. తినే సమయంలో నీళ్లు తాగకూడదా..? ఏమౌతుంది..?    

 

ఎందుకీ అనుమానం..?

సెల్‌ఫోన్ల నుంచి వెలువడే 'నాన్-అయోనైజింగ్' రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ (RF-EMW) కణజాలాలపై ప్రభావం చూపుతుందని కొన్ని ప్రాథమిక అధ్యయనాలు సూచించాయి. ఫోన్‌ను జేబులో ఉంచినప్పుడు అది వృషణాలకు (Testes) సమీపంలో ఉండటం వల్ల, అక్కడి ఉష్ణోగ్రత పెరిగి శుక్రకణాల నాణ్యత తగ్గవచ్చనేది ప్రధాన వాదన.

సాక్ష్యాలు ఎందుకు సరిపోవు..?

 

ప్రయోగశాల ఫలితాలు vs వాస్తవం.. చాలా పరిశోధనలు ప్రయోగశాలల్లో (In-vitro) కృత్రిమ పరిస్థితుల్లో జరిగాయి. మానవ శరీరంపై సహజ సిద్ధంగా జరిగే ప్రభావానికి, వీటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలు కేవలం గణాంకాల ఆధారంగా (Observational) సాగాయి తప్ప, నేరుగా ఫోన్ వాడకం వల్లే సమస్య వచ్చిందని నిరూపించలేకపోయాయి. సంతానలేమికి మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, ధూమపానం వంటి అనేక కారణాలు ఉంటాయి. సంతానలేమికి కేవలం ఫోన్‌ మాత్రమే కారణం అనడం సరైనది కాదని వైద్యనిపుణులు అంటున్నారు. ప్రస్తుతానికి ఉన్న పరిశోధనల్లో కొన్ని లోపాలు ఉన్నాయని డాక్టర్ హోటలింగ్ అభిప్రాయపడుతున్నారు. 

హీట్ ఎఫెక్ట్..

వృషణాలు ఆరోగ్యకరమైన శుక్రకణాలను ఉత్పత్తి చేయాలంటే అవి శరీర ఉష్ణోగ్రత కంటే దాదాపు 2 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండాలి. ఫోన్ నుంచి వెలువడే వేడి కంటే, బిగుతుగా ఉండే దుస్తులు లేదా ఎక్కువ సేపు ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పనిచేయడం వల్ల కలిగే ఉష్ణోగ్రత పెరుగుదలే ఎక్కువ ప్రమాదకరమని డాక్టర్ హోటలింగ్ హెచ్చరిస్తున్నారు.

 ఏం చేయాలి మరి..?

అధారాలు లేవని నిర్లక్ష్యం చేయడం కంటే, కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఫోన్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. వీలైతే ఫోన్‌ను షర్ట్ జేబులో లేదా బ్యాగులో ఉంచుకోవడం బెటర్. ల్యాప్‌టాప్‌లను నేరుగా ఒడిలో పెట్టుకోకుండా టేబుల్‌పై ఉంచి వాడుకోవాలి. వ్యాయామం, సరైన నిద్ర, పోషకాహారం సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. సెల్‌ఫోన్ రేడియేషన్‌కు, సంతానలేమికి మధ్య సంబంధంపై ఇంకా లోతైన పరిశోధనలు జరగాల్సి ఉంది. అప్పటివరకు అనవసర భయాందోళనలు చెందకుండా, జాగ్రత్తగా ఉండటమే ఉత్తమం.

ఇది కూడా చదవండి.. బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఇవి మీకోసమే.. 

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

 ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ ఎంత ఉండాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.