ఒరోపౌచ్ వైరస్ అంటే ఏమిటి.. ?  

షేర్ చేయండి:
ఒరోపౌచ్ వైరస్ అంటే ఏమిటి.. ?  

సాక్షి లైఫ్ : దేశవ్యాప్తంగా తీవ్రంగా వర్షాలు కురుస్తుండడంతో అనేక సీజనల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతోంది. వరదలవల్ల దోమలు పెరిగి తద్వారా వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువఅవుతోంది. ఇటీవల డెంగ్యూ ,వెస్ట్ నైల్ వైరస్‌తో సహా దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

ఇటీవల బ్రెజిల్‌లోని బహియాలో ఒరోపౌచ్ వైరస్ కారణంగా ఇద్దరు యువతులు మరణించారు. దీంతో ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..? ఈ ఏడాది బ్రెజిల్‌లో దాదాపు 7 వేల మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఒరోపౌచ్ వైరస్ ప్రధానంగా మిడ్జెస్ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇది ఒక రకమైన చిన్న ఈగ. దోమల కాటు ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. 

ఒరోపౌచ్ ఫీవర్ అంటే ఏమిటి..?

ఒరోపౌచ్ జ్వరం అనేది ఉష్ణమండల వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ప్రధానంగా మిడ్జ్ అనే చిన్న ఈగ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇది దోమల కాటు ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. అధిక జ్వరం, కండరాలలో నొప్పి వంటి ప్రధాన లక్షణాలుంటాయి. ఈ వైరస్ కు ట్రినిడాడ్, టొబాగోలోని ఒరోపౌచె నది పేరు పెట్టారు. దీనిని మొదట 1955లో కనుగొన్నారు. 

ఒరోపౌచ్ ఫీవర్ లక్షణాలు..?

ఒరోపౌచ్ ఫీవర్ సడెన్ గా వస్తుంది. దోమ లేదా ఈగ కాటు వేసిన 4-8 రోజులలో లక్షణాలు కనిపిస్తాయి.

-తీవ్ర జ్వరం

-తీవ్రమైన తలనొప్పి

- కీళ్లు,కండరాల నొప్పి

- చలి 

- వాంతి

- మైకము


చాలా సందర్భాలలో ఒక వారంలో ఇది నయం అవుతుంది. తీవ్రమైన కేసులు అసెప్టిక్ మెనింజైటిస్‌కు దారితీయవచ్చు.  

ఎలా నివారించాలి..?  

ఒరోపౌచ్ ఫీవర్ కు ప్రస్తుతం నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. జ్వరం , నొప్పి లక్షణాలను గమనించడం ద్వారా చికిత్స ప్రధానంగా జరుగుతుంది. విశ్రాంతి తీసుకోవడం, పుష్కలంగా ద్రవపదార్థాలు త్రాగడం ద్వారా కోలుకోవచ్చు. 

ఒరోపౌచ్ ఫీవర్ ఎదుర్కోవటానికి నివారణ ముఖ్యం.. 

- పురుగుల మందు వాడండి

-శరీరానికి నిండుగా కప్పే దుస్తులు ధరించండి

-దోమతెరలు వాడండి.. 

 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ ఎలాంటి వారికి వస్తుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.