కార్టిసాల్‌ కు డిప్రెషన్‌కు లింక్ ఏంటీ..?

షేర్ చేయండి:
కార్టిసాల్‌ కు డిప్రెషన్‌కు లింక్ ఏంటీ..?

సాక్షి లైఫ్ : మన శరీరం రోజుకు ఒకసారి కార్టిసాల్‌ను విడుదల చేస్తుంది. ఇది శరీర సాధారణ ప్రక్రియ. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు డేవిడ్ స్పీగెల్ అండ్ బాబ్ సపోల్స్కీ ఒక పరిశోధన చేసి, ఈ ఆరోగ్యకరమైన కార్టిసాల్ ఉదయం కాకుండా రాత్రి 8-9 గంటల మధ్య విడుదల అయితే, అది డిప్రెషన్‌కు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల, ఉదయాన్నే సూర్యరశ్మి తగలడం ద్వారా, ఆరోగ్యకరమైన కార్టిసాల్ స్థాయిలను సాయంత్రం కాకుండా ఉదయానికి మార్చడం ద్వారా డిప్రెషన్ వంటి వ్యాధులను నివారించవచ్చని అధ్యయనాలు తేల్చాయి. 

ఇది కూడా చదవండి..పిల్లల పెరుగుదలకు ఎలాంటి ఆహారం అవసరం..?

ఇది కూడా చదవండి..విటమిన్స్ అన్నిటిని పొందాలంటే..? ఏమిచేయాలి..?

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

 ఉదయాన్నే శరీరానికి సూర్యరశ్మి తగలడం వల్ల స్లీప్ హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది, ఇది రాత్రిపూట మంచి నిద్రను పొందడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, ఉదయపు సూర్యరశ్మి కూడా హ్యాపీ హార్మోన్ డోపమైన్‌ను విడుదల చేస్తుంది. ఇది మనకు ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాదు ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది.

ఆహారం- పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ.. 

చలి సమయంలో ఆకలితోపాటు, ఆహారపు అలవాట్లు కూడా మారుతాయి. ప్రజలు అధిక చక్కెర , ఫాస్ట్ ఫుడ్ తినడం వైపు మొగ్గు చూపుతారు. ఫాస్ట్ ఫుడ్ , అధిక చక్కెర శరీరానికి హానికరమే కాదు, అవి మన మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తాయి.

పండ్లు ,కూరగాయలు, ఆరోగ్యకరమైన ఆహారం తినే వారి కంటే ఫాస్ట్ ఫుడ్ తినే వ్యక్తులు డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక పరిశోధనలో తేలింది.

ఆహార పదార్థాలు.. 

మన మూడ్‌ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి, అందుకే చలికాలంలో జంక్ ఫుడ్ కాకుండా ఆరోగ్యకరమైన పదార్థాలు రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని వైద్య నిపుణులు అంటున్నారు.

డిప్రెషన్ కి ప్రధాన కారణం..?

శీతాకాలంలో డిప్రెషన్ కి ప్రధాన కారణం సూర్యరశ్మి లేకపోవడం. సహజంగా చలికాలంలో ప్రజలు కిటికీలకు కర్టెన్లు వేస్తారు. తద్వారా ఉదయం సూర్యకాంతి వారి నిద్రకు భంగం కలిగించదు, కానీ ఈ సూర్యరశ్మి చాలా ముఖ్యమైనది. ఇది మన మానసిక స్థితిని చక్కగా ఉంచుతుంది. నిద్రను మెరుగుపరుస్తుంది. ఔషధాల ద్వారా చేసే పని, సూర్యరశ్మి చేస్తుంది.  

 

ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?

ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?.. 

ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.