నో షేవ్ నవంబర్ వెనుక కథ ఏమిటి..?
సాక్షి లైఫ్ : నవంబర్ నెల రాగానే చాలా మంది ఇటీవల కాలంలో గడ్డం, జుట్టు పెంచడం మొదలుపెట్టడం మీరు గమనించే ఉంటారు. ఈ ట్రెండ్ నో షేవ్ నవంబర్ అంటారు. అసలు ఎందుకు ఇలాంటి ప్రచారం చేపట్టారు..? ఎవరికోసం దీని వల్ల ఎవరికి మేలు జరుగుతుంది..? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తెలుసా? నో షేవ్ నవంబర్ ఎప్పుడు..? ఏ కారణంతో ప్రారంభించారు?
వైద్యనిపుణులు సోరియాసిస్‌ను ఎలా నిర్ధారిస్తారు?
పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?
40 దాటాక పురుషుల్లో వచ్చే ఆరు వ్యాధులు..
చాలా మంది నవంబర్ నెలలో గడ్డం తీయరు.
ఈ ట్రెండ్‌ని 'నో షేవ్ నవంబర్' అంటారు.
ఈ ప్రచారం వెనుక చాలా ఆసక్తికరమైన కారణం దాగి ఉంది.
నవంబర్ నెల రాగానే చాలా మంది షేవింగ్ చేయడం మానేస్తారు. అందుకే దీనిని 'నో షేవ్ నవంబర్' అని కూడా పిలుస్తుంటారు. అయితే నవంబర్‌లో కొందరు గడ్డం చేసుకోరు, జుట్టు కూడా కత్తిరించుకోరు ఎందుకు..? అనే విషయం మీకు తెలుసా..? అసలు ఈ ట్రెండ్ ఎందుకు ప్రజాదరణ పొందింది..? అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. కొంతమంది కేవలం ఫ్యాషన్ కోసమే ఎలాంటి కారణం లేకుండా ఈ ప్రచారాన్ని ఫాలో అవుతున్నారు. కానీ దీనికి ప్రధాన కారణం మరొకటి ఉంది..
నో షేవ్ నవంబర్ అంటే ఏమిటి..?
'నో షేవ్ నవంబర్' అనేది క్యాన్సర్, ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి ఎంచుకున్న ఒక ప్రచారం. ఈ కాలంలో, ప్రజలు ఒక నెల పాటు వారి గడ్డం లేదా జుట్టును కత్తిరించరు. దీని ఉద్దేశ్యం జుట్టు పెరగడమే కాదు, క్యాన్సర్ తో బాధపడే వారికి తమవంతుగా మద్దతు ఇవ్వడం కోసం చేసేఒక ప్రచారం ఇది.
జుట్టు కత్తిరించడం క్యాన్సర్ రోగులకు ఎలా సహాయం చేస్తారు..?
జుట్టు కత్తిరించకపోవడం క్యాన్సర్ రోగులకు ఎలా సహాయపడుతుందని మీరు ఆలోచిస్తున్నారా? వాస్తవానికి, ఈ ప్రచారం లక్ష్యం జుట్టు పెరగడం మాత్రమే కాదు, జుట్టు కత్తిరించడానికి ఖర్చు చేసే డబ్బు క్యాన్సర్ రోగుల చికిత్స కోసం విరాళంగా ఇస్తారు. ఈ విధంగా కొందరు అవగాహన కల్పించడమే కాకుండా క్యాన్సర్‌తో పోరాడుతున్న బాధితులకు మద్దతు ఇస్తుంటారు.
2009లో, మాథ్యూ హిల్ ఫౌండేషన్ అనే అమెరికన్ ప్రభుత్వేతర సంస్థ "నో షేవ్ నవంబర్" ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రధాన లక్ష్యం క్యాన్సర్‌తో పోరాడే బాధితులకు సహాయం అందించడానికి నిధులు సేకరించడం కోసం. ఈ ప్రచారం ద్వారా సేకరించిన డబ్బును క్యాన్సర్ చికిత్స, నివారణ, అవగాహన కోసం కృషి చేస్తున్న వివిధ సంస్థలకు అందిస్తారు.
ఇది కూడా చదవండి..పక్షవాతంలో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి నిర్దిష్ట పండ్లు ఉన్నాయా..?
ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోపతి అంటే ఏమిటి..?
40 దాటాక పురుషుల్లో వచ్చే ఆరు వ్యాధులు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
