Kidney Stone Treatment : కిడ్నీలో ఏ సైజ్ రాళ్లకు ఎలాంటి ట్రీట్‌మెంట్ అవసరం..?
సాక్షి లైఫ్ : కిడ్నీలో చిన్న రాళ్లు ఏర్పడినప్పుడు వాటిని సాధారణంగా పెద్దగా పట్టించుకోరు. అయితే, 'న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్' లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం మాత్రం భిన్నమైన అంశాన్ని వెల్లడించింది. ఎలాంటి లక్షణాలు లేని చిన్న రాళ్లను సైతం అలాగే వదిలేస్తే.. రాబోయే ఐదేళ్లలో వ్యాధి మళ్లీ తిరగబెట్టే (Relapse) ప్రమాదం పెరుగుతుందని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది.
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
ఇది కూడా చదవండి.. ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ ఎంత ఉండాలి..?
రాళ్ల పరిమాణంతోపాటు..
కిడ్నీలో రాళ్లకు అందించే చికిత్స పూర్తిగా ఆ రాళ్ల పరిమాణం వాటి వల్ల కలిగే లక్షణాలపై ఆధారపడి ఉంటుంది" అని నిపుణులు చెబుతున్నారు. వివిధ పరిమాణాలలో ఉండే కిడ్నీ రాళ్లకు ఏ రకమైన సర్జరీలు లేదా చికిత్స అవసరమనే దానిపై నిపుణులు వివరంగా తెలియజేశారు.
చిన్న రాళ్లు (1-4 మి.మీ.)..
2 మి.మీ. కంటే తక్కువ ఉన్నవి: ఈ అతి చిన్న రాళ్లు సాధారణంగా ఎలాంటి సర్జరీ లేకుండానే వాటంతట అవే మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి. వీటివల్ల కింది వీపు భాగంలో లేదా పక్కటెముకల కింద స్వల్ప నొప్పి, అసౌకర్యం, మూత్రవిసర్జన సమయంలో స్వల్ప మంట కలగడం లేదా ఎలాంటి లక్షణాలు లేకపోవడం జరుగవచ్చు. తగిన మోతాదులో నీరు తాగితే ఇవి సులభంగా బయటికి పోతాయి.
2 నుంచి 4 మి.మీ. సైజ్ ఉన్నవి..
ఈ రాళ్లు కూడా చాలావరకు సహజంగానే బయటికి వస్తాయి. కాకపోతే ఇవి కొంచెం ఎక్కువ నొప్పిని కలిగిస్తాయి. వీపు లేదా పక్క భాగంలో తీవ్రమైన నొప్పి, తరచూ నొప్పులు రావడం, వికారం, తరచూ మూత్ర విసర్జన చేయాలనే కోరిక వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా వీటికి సర్జరీ అవసరం ఉండదు కానీ, నొప్పి నివారణకు వైద్యుల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది.
మధ్యస్థాయి రాళ్లు (5-6 మి.మీ.)..
ఈ పరిమాణంలో ఉన్న రాళ్లు సహజంగా బయటికి వెళ్లే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇవి విపరీతమైన నొప్పి, వాంతులు, మూత్రంలో రక్తం పడటం, మూత్ర విసర్జనలో ఇబ్బందిని కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో మందుల ద్వారా ఇవి బయటికి వెళ్లవచ్చు. కానీ రాయి కదలకపోయినా, నిరంతరం నొప్పి లేదా ఇన్ఫెక్షన్ వేధిస్తున్నా వైద్యులు తగిన ప్రొసీజర్లను సూచిస్తారు.
7 మి.మీ. కంటే పెద్ద రాళ్లు..
ఏడు మి.మీ. కన్నా పెద్దగా ఉన్న రాళ్లకు సర్జరీ లేదా చికిత్స అవసరం. ఇవి సహజంగా బయటికి రాలేక మూత్రనాళాన్ని అడ్డుకునే ప్రమాదం ఉంది. దీనివల్ల తీవ్రమైన నొప్పి, మూత్రంలో ఎక్కువగా రక్తం పడటం, తరచూ ఇన్ఫెక్షన్లు, జ్వరం, మూత్ర ప్రవాహం తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇటువంటి సందర్భాల్లో వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
