Which Exercises Can Increase Lifespan..? : ఎలాంటి వ్యాయామాలు ఆయుష్షును పెంచుతాయి..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన ఆహారం, ప్రశాంతమైన నిద్ర, ఒత్తిడి లేని జీవనం.. వీటన్నింటితో పాటు శారీరక శ్రమ తోడైతేనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. అయితే, ఏ రకమైన వ్యాయామం చేస్తే ఎక్కువ కాలం జీవించవచ్చనే అంశంపై చాలామందిలో సందేహాలు ఉంటాయి. తాజాగా ‘బిఎమ్‌జే మెడిసిన్’ (BMJ Medicine) ప్రచురించిన ఒక పరిశోధన పత్రం ఈ విషయంలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. కేవలం ఒకే రకమైన వ్యాయామానికి పరిమితం కాకుండా, రకరకాల శారీరక శ్రమలు చేయడం వల్ల మరణాల ముప్పు గణనీయంగా తగ్గుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

 

అధ్యయనం ఏం చెబుతోంది..?

హార్వర్డ్ టీహెచ్ చాన్‌ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన పరిశోధకులు సుమారు 1.11 లక్షల మందిపై దాదాపు 30 ఏళ్ల పాటు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారి వ్యాయామ అలవాట్లను నిశితంగా పరిశీలించారు. కేవలం జిమ్‌కు వెళ్లడం లేదా పరుగెత్తడం మాత్రమే కాకుండా, దైనందిన జీవితంలో చేసే రకరకాల పనులను కూడా ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు.

పరిశోధనలో చేర్చిన వ్యాయామాలు..

నడక, జోగింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, టెన్నిస్ వంటి చేయాలి. తక్కువ తీవ్రత ఉన్నవి..యోగా, స్ట్రెచింగ్. బరువులు ఎత్తడం, శ్రమతో కూడిన పనులు, తోటపని, మొక్కలు నాటడం, గడ్డపారతో తవ్వడం వంటివి.

ఒకే వ్యాయామం కంటే.. 

చాలామంది ప్రతిరోజూ కేవలం వాకింగ్ మాత్రమే చేస్తుంటారు. అయితే, ఈ అధ్యయనం ప్రకారం, వ్యాయామంలో వైవిధ్యం (Variety) ఉండటం వల్ల అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి.19 శాతం తక్కువ ముప్పు: రకరకాల వ్యాయామాలు చేసేవారిలో అకాల మరణ ముప్పు 19 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వ్యాధుల నియంత్రణ: గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల వల్ల వచ్చే మరణాల ముప్పు కూడా 13-14 శాతం తగ్గుతుందని తేలింది. కేవలం వ్యాయామం చేసే సమయాన్ని పెంచడమే కాకుండా, విభిన్న రకాల శ్రమలను అలవరచుకోవడం వల్ల ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుంది" అని పరిశోధకులు పేర్కొన్నారు.

అపరిమిత వ్యాయామం అవసరమా..?

ఎంత ఎక్కువ వ్యాయామం చేస్తే అంత మంచిదని కొందరు భావిస్తారు. కానీ, ఒక నిర్దిష్ట స్థాయి దాటిన తర్వాత వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు స్థిరంగా ఉండిపోతాయని (Plateau effect) ఈ పరిశోధన వెల్లడించింది. అంటే, గంటల తరబడి ఒకే పని చేయడం కంటే, తక్కువ సమయంలోనే వివిధ రకాల వ్యాయామాలను మేళవించడం ఉత్తమం.

వంశపారపర్యంగా వచ్చే జన్యువులను మనం మార్చలేం కానీ, మన జీవనశైలిని మార్చుకోవడం ద్వారా దీర్ఘాయువును సొంతం చేసుకోవచ్చు. కాబట్టి, రోజూ చేసే నడకతో పాటు వారంలో రెండు రోజులు యోగా, మరో రెండు రోజులు బరువులు ఎత్తడం లేదా తోటపని వంటివి చేయడం అలవాటు చేసుకోవాలి. శరీరానికి అన్ని విధాలా శ్రమ కలిగినప్పుడే అది దృఢంగా, ఆరోగ్యంగా మారుతుంది.

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..! 

 ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.