ఆరోగ్యానికి ఏ టాయిలెట్ ఉత్తమం ఇండియన్ లేదా వెస్ట్రన్ టాయిలెట్..?  

షేర్ చేయండి:
ఆరోగ్యానికి ఏ టాయిలెట్ ఉత్తమం ఇండియన్ లేదా వెస్ట్రన్ టాయిలెట్..?  

సాక్షి లైఫ్ : వెస్ట్రన్ టాయిలెట్, ఇండియన్ టాయిలెట్.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం అనేదానిపై భిన్నాభిప్రాయాలు ఉంటాయి. వీటి సౌలభ్యం, సంస్కృతిపై ఆధారపడి ఏది మంచిదనేది ఉండొచ్చు.. కొన్ని ప్రధాన తేడాలు ఉండడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండొచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం వెస్ట్రన్ టాయిలెట్ల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. కొంతమంది తమ సౌలభ్యం కోసం, వారి ఇంటిని లేటెస్ట్ మోడల్ హౌస్ లా ఉందని చూపించుకు నేందుకు వెస్ట్రన్ టాయిలెట్లను ఉపయోగిస్తున్నారు. చాలా మంది ఇవే మంచివని నమ్ముతుండగా, మరికొందరు ఇండియన్  టాయిలెట్స్ ఉత్తమమని భావిస్తున్నారు. అయితే ఈ రెండిటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..జంక్ ఫుడ్ కూడా కార్డియాక్ అరెస్ట్ కారణమేనా..? 

ఇది కూడా చదవండి..మీ శరీరంలో ఐరన్ పరిమాణాన్నిపెంచే ఆహారాలు.. 

ఇది కూడా చదవండి..గర్భధారణ సమయంలో ఊబకాయం ఉన్న పిల్లలలో ఆటిజం ప్రమాదం..

 

 

 

వెస్ట్రన్ టాయిలెట్స్..  

ఈ రోజుల్లో ప్రజల జీవన విధానం చాలా మారిపోయింది. సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి, మనం మన జీవనశైలిలో అనేక విషయాలను మార్చుకుంటున్నాము. దీంతో ఇవి మన ఆరోగ్యంపై చెడు ప్రభావాలను చూపిస్తున్నాయి. అటువంటి వాటిల్లో పాశ్చాత్య మరుగుదొడ్లు ఒకటి. ఇవి ఈ రోజుల్లో చాలా మంది ప్రజల జీవనశైలిలో భాగంగా మారాయి. ప్రస్తుతం చాలా మంది వెస్ట్రన్ టాయిలెట్లను ఉపయోగిస్తున్నారు. దీని కారణంగా భారతీయ టాయిలెట్ల ట్రెండ్ తగ్గుతోంది.

భారతీయ మరుగుదొడ్లు.. 

భారతీయ మరుగుదొడ్లు ఫిట్‌గా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పాశ్చాత్య మరుగుదొడ్ల కంటే ఇండియన్ టాయిలెట్లు మిమ్మల్ని ఫిట్‌గా ఉంచడంలో మరింత సహాయపడతాయి. నిజానికి, భారతీయ శైలి టాయిలెట్లపై కూర్చోవడం మీ శరీరానికి వ్యాయామం వలే పనిచేస్తుంది. ఇలా కూర్చోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

కూర్చునే విధానం.. 

మీరు భారతీయ టాయిలెట్‌లో కూర్చున్న విధానం మీ రక్త ప్రసరణను పెంచుతుంది. మీ చేతులు,కాళ్ళకు  మంచి ఎక్సర్ సైజ్ లా పని చేస్తుంది
పాశ్చాత్య మరుగుదొడ్ల కంటే భారతీయ టాయిలెట్లు పర్యావరణ అనుకూలమైనవి. వాస్తవానికి కొన్నిపాశ్చాత్య మరుగుదొడ్లలో పేపర్ ఉపయోగిస్తారు. కొన్నిరకాల వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్లకు ఎక్కువ నీరు అవసరం. ఈ రెండిటి విషయంలో భారతీయ మరుగుదొడ్లు చాలా మెరుగ్గా ఉంటాయి.

జీర్ణక్రియ.. 

భారతీయ టాయిలెట్‌లో కూర్చోవడం వల్ల మీ పొట్ట కుదించుకుపోతుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. దీనికి విరుద్ధంగా, వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్‌లో కూర్చోవడం వల్ల కడుపుపై ​​ఎటువంటి ఒత్తిడి ఉండదు. కొన్నిసార్లు విసర్జన కూడా సరిగ్గా అవ్వదు. తద్వారా పలు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

ఇండియన్ స్టైల్ టాయిలెట్లు.. 

ఇండియన్ స్టైల్ టాయిలెట్లు గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే భారతీయ టాయిలెట్లను ఉపయోగించడానికి, వారు స్క్వాట్ పొజిషన్‌లో కూర్చోవాలి, ఇది సాఫీగా, సహజ ప్రసవానికి సహాయ పడుతుంది. అలాగే దీని వాడకం వల్ల గర్భాశయంపై ఎలాంటి ఒత్తిడి ఉండదు.

స్క్వాట్ పొజిషన్‌.. 

ఇండియన్ టాయిలెట్‌లో స్క్వాట్ పొజిషన్‌లో కూర్చోవడం వల్ల పెద్దప్రేగు మలాన్ని పూర్తిగా బయటకు పంపుతుంది. ఇది మలబద్ధకం, అపెండిసైటిస్, పెద్దప్రేగు క్యాన్సర్‌కు దారితీసే ఇతర కారకాలను నివారిస్తుంది.

 ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

 నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

 ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

 ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.