మీ శరీరంలో ఐరన్ పరిమాణాన్నిపెంచే ఆహారాలు..
సాక్షి లైఫ్ : శరీరంలో ఐరన్ పాత్ర చాలా ఉంది. సరైన పనితీరుకు, పెరుగుదలకు అవసరమైన ఖనిజం ఇది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే శరీరం బలహీన పడుతుంది. అంతేకాదు శరీరంలో ఐరన్ లోపం తలెత్తుతుంది. ఐరన్ లోపం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. పిల్లలు, మహిళలు దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరం స్వయంగా ఇనుమును ఉత్పత్తి చేయదు. మనం తినే ఆహారం ద్వారా ఐరన్ లభిస్తుంది. అందుకోసం ఎలాంటి ఆహారాలు తినాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఎలాంటి అలవాట్లు ఫ్యాటీలివర్ కు కారణమవుతాయి..?
జంక్ ఫుడ్ కూడా కార్డియాక్ అరెస్ట్ కారణమేనా..?
ఊపిరితిత్తులను రక్షించే పండ్లు.. తాజా అధ్యయనంలో వెల్లడి..
నల్ల నువ్వులు..
నల్ల నువ్వులలో ఐరన్, కాపర్, జింక్, సెలీనియం, ఫోలేట్ వంటి అనేక విటమిన్లు ఉన్నాయి. నల్ల నువ్వులను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. తద్వారా శరీరానికి కావాల్సిన ఇనుము లభిస్తుంది.
ఖర్జూరం-ఎండుద్రాక్ష..
ఖర్జూరం ,ఎండుద్రాక్షలో ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్ "ఏ", విటమిన్ "సి" పుష్కలంగా ఉన్నాయి. రోజూ రెండు లేదా మూడు ఖర్జూరాలు ,ఒక టేబుల్ స్పూన్ ఎండుద్రాక్షలను అల్పాహారంగా తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి , ఐరన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.
బీట్రూట్-క్యారెట్..
బీట్‌రూట్, క్యారెట్‌లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండింటినీ జ్యూస్ రూపంలో రోజూ ఉదయం తాగవచ్చు. ఒక టీస్పూన్ నిమ్మరసం కూడా రసంలో చేర్చవచ్చు. నిమ్మరసంలో విటమిన్ "సి" పుష్కలంగా ఉంటుంది. తద్వారా వ్యాధినిరోధక శక్తి కూడా లభిస్తుంది.
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.
ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
