Water Bottles Colored Caps : వాటర్ బాటిల్స్ కు డిఫరెంట్ కలర్ క్యాప్స్ ఎందుకు ఉంటాయి..? వాటి మీనింగ్ ఏంటో తెలుసా..?   

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చాలా మంది వాటర్ బాటిల్ కొనుగోలు చేసేటప్పుడు క్యాప్ కలర్ ను పట్టించుకోరు. వాటర్ బాటిళ్లపై ఉండే వివిధ కలర్ క్యాప్‌లకు నిర్దిష్టమైన అర్థాలు ఉంటాయి. ఆయా క్యాప్ రంగు బాటిల్ లోపల ఎలాంటి నీరు ఉందో మనకు తెలియజేస్తుంది. మీరు వాటర్ బాటిల్ కొనుగోలు చేసేటప్పుడు క్యాప్ రంగును పరిశీలిస్తారా..? సహజంగా మనం బ్రాండ్, ధర ఆధారంగా మాత్రమే వాటర్ బాటిల్‌ను కొనుగోలు చేస్తూ ఉంటాం.. కానీ క్యాప్ రంగు నీళ్ల రకం గురించిన సమాచారాన్ని అందిస్తుందనే విషయం మీకు తెలుసా..? వాటర్ బాటిల్ కు ఉండే చిన్న క్యాప్ బాటిల్‌లోని నీటి రకాన్ని వెల్లడిస్తుంది. రుచి, ఫ్లేవర్, ఆల్కలీన్, ఆర్వో లేదా ఎలక్ట్రోలైట్ వంటివాటి గురించి సమాచారం అందిస్తాయి బాటిల్స్ కు ఉండే కలర్ క్యాప్స్..  

 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

 

వాటర్ బాటిల్ క్యాప్ కలర్ మీనింగ్..? 

గ్రీన్ క్యాప్.. 

మీరు బాటిల్‌పై ఆకుపచ్చ రంగు కలిగిన మూతను చూసినట్లయితే, దానిలో ఫ్లేవర్డ్ నీరు ఉందని అర్థం. అంతేకాదు ఆ నీటిలో కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసినట్లుగా భావించాలి. ఇది సాధారణంగా మనం తాగేనీరు కాదు, రుచిగా ఉండే వాటర్.

బ్లూ క్యాప్.. 

బ్లూ క్యాప్ బాటిల్‌లో మినరల్స్ వాటర్ ఉంటుంది. ఇది సహజ వనరుల నుంచి తీసుకుని, ఫిల్టర్ చేసిన నీరు. ఈ నీరు ప్రకృతిలో సహజంగా లభించే అచ్చమైన రుచి, ఖనిజాలను కలిగి ఉంటుంది.

బ్లాక్ క్యాప్..  

బ్లాక్ క్యాప్‌ కలిగిన బాటిల్ విషయంలో అయితే, ఇది ఆల్కలీన్ నీరు. ఈ నీరు సాధారణ నీటి కంటే ఎక్కువ pH (పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్) స్థాయిని కలిగి ఉంటుంది, దీనిని కొంతమంది శరీర ఆమ్ల స్థాయిలను సమతుల్యం చేయడానికి ఉపయోగిస్తారు.

వైట్ క్యాప్.. 

వైట్ క్యాప్ అంటే నీరు ఆర్వో లేదా ప్రాసెస్ చేసిన నీరు. దీని అర్థం దాని ఖనిజాలను సమతుల్యం చేయడానికి యంత్రం ద్వారా శుభ్రం చేస్తారు. ఇది రోజువారీ జీవితంలో సాధారణంగా ఉపయోగించే నీరు.

ఎరుపు రంగు క్యాప్ లు ఉన్న బాటిల్ లో ఎలక్ట్రోలైట్ లేదా కార్బోనేటేడ్ నీరు ఉంటాయి. ఇది త్వరగా హైడ్రేషన్ అందించడానికి రూపొందించిన వాటర్. ఎల్లో కలర్‌ క్యాప్‌ కలిగి ఉన్న వాటర్‌ బాటిల్‌లో విటమిన్లు, ఎలక్ట్రోలైట్స్‌ ఉంటాయని అర్థం చేసుకోవాలి. పింక్ కలర్‌ క్యాప్‌ ఉండే వాటర్‌ బాటిల్ కొన్ని ఛారిటీ సంస్థలు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఈరకమైన క్యాప్స్‌ను ఉపయోగిస్తాయి.  

ఈ సారి బాటిల్ కొన్నప్పుడు, క్యాప్ ను తనిఖీ చేయడం మర్చిపోవద్దు. ప్రతి రంగు ఒక్కో అర్థాన్ని కలిగి ఉంటుంది, ఏ కలర్ బాటిల్ కు ఏ ఏ కలర్ క్యాప్ ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవడం ద్వారా మనకు కావాల్సిన వాటర్ బాటిల్‌ను ఎంచుకోవడం చాలా సులభం అవుతుంది. చిన్న క్యాప్ బాటిల్‌లో ఏ రకమైన నీరు ఉందో తెలియజేస్తుంది. గుర్తుంచుకోండి, కొన్ని బ్రాండ్లు వారి బ్రాండ్ ఇమేజ్ ఆధారంగా కూడా క్యాప్ కలర్ ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.

 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.