Health Care: ధూమపానం చేసేవారికి ఆరోగ్య బీమా ఎందుకు తప్పనిసరి..?

సాక్షి లైఫ్ : ధూమపానం (Smoking) అనేది కేవలం వ్యక్తిగత అలవాటు మాత్రమే కాదు, అది గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ కారణంగానే ధూమపానం చేసేవారు ఇతరుల కంటే తరచుగా, దీర్ఘకాలిక చికిత్స అవసరమయ్యే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఇది కూడా చదవండి..Sciatica : సయాటికా, నడుము నొప్పి ఉపశమనం కోసం ఉత్తమ యోగాసనాలు..

ఇది కూడా చదవండి..Hypertension : చెవుల్లో 'రింగుమనే' శబ్దం హైపర్‌టెన్షన్‌కు హెచ్చరిక సంకేతమా..?

ఇది కూడా చదవండి..@ 7 ఏళ్లు : ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం 'ఆయుష్మాన్ భారత్'..  

 

ఈ ప్రమాదం దృష్ట్యా, ధూమపానం చేసేవారికి ఆరోగ్య బీమా అనేది అత్యవసరం (Necessity) అని వైద్య నిపుణులు, ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

 బీమా ధూమపానం చేసేవారికి ఎందుకు తప్పనిసరి..?

తీవ్ర వ్యాధుల ముప్పు..  

ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు (Heart Disease), దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు (COPD), స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఈ వ్యాధుల చికిత్సకు అయ్యే ఖర్చు లక్షల్లో ఉంటుంది. బీమా లేకపోతే, తీవ్ర అనారోగ్యం పాలైనప్పుడు ఆ భారీ వైద్య ఖర్చు కుటుంబ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తుంది. బీమా ఈ ఖర్చుల నుండి రక్షణ కల్పిస్తుంది.

నాణ్యమైన వైద్యం..  

ఆరోగ్య బీమా ఉంటే, డబ్బు గురించి చింతించకుండా, ఉత్తమమైన చికిత్సను, మెరుగైన నెట్‌వర్క్ ఆసుపత్రులలో పొందవచ్చు. మీరు ధూమపానం చేసేవారైనా, ఆరోగ్య బీమాకు దరఖాస్తు చేసుకునే హక్కు ఉంటుంది. కానీ అలవాటును దాచిపెడితే, భవిష్యత్తులో క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి నిజం చెప్పి పాలసీ తీసుకోవడం ఉత్తమం.

 ప్రీమియం ఎందుకు పెరుగుతుంది..?

సాధారణంగా, ధూమపానం చేసేవారికి బీమా కంపెనీలు అధిక ప్రీమియం (Higher Premium) వసూలు చేస్తాయి. ఎందుకంటే..?

ఎక్కువ రిస్క్ ఎవరికి.. 

ధూమపానం చేసేవారు బీమా కంపెనీలకు అధిక రిస్క్ ఉన్న వ్యక్తులుగా పరిగణించబడతారు. వీరు ఇతరుల కంటే ఎక్కువసార్లు క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది.

ముందస్తుగా కొన్ని పరీక్షలు అవసరం.. 

 40 ఏళ్లు పైబడిన లేదా ధూమపానం ఎక్కువగా చేసేవారికి పాలసీ ఇచ్చే ముందు నికోటిన్ పరీక్షలు సహా కొన్ని వైద్య పరీక్షలు (Medical Tests) చేయించడం తప్పనిసరి కావచ్చు. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రీమియం నిర్ణయిస్తారు.


ప్రీమియం ఎక్కువైనా, దాని భారాన్ని తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.. అవేంటంటే..?   

తక్కువ వయస్సులో బీమా తీసుకోవడం వల్ల..  

 ఆరోగ్యంగా ఉన్నప్పుడే తక్కువ వయస్సులోనే బీమా తీసుకుంటే, ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. వ్యాధులు వచ్చాక పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకూ తక్కువ వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. 

పొగ తాగడం మానేయాలి.. 

 ఇది అన్నింటికంటే ఉత్తమమైన మార్గం. పొగ తాగడం మానేసిన తర్వాత కొంత కాలం అంటే సుమారు 2 నుంచి 5 సంవత్సరాల పాటు స్మోకింగ్  హ్యాబిట్ లేదని నిరూపించుకుంటే, బీమా కంపెనీ ఆ కేటగిరీని "నాన్-స్మోకర్"గా మార్చే అవకాశం ఉంది. అప్పుడు ప్రీమియం గణనీయంగా తగ్గుతుంది. ఒకేసారి ఒక కంపెనీ పాలసీ తీసుకోకుండా, వివిధ బీమా సంస్థల ప్రీమియం ధరలను, కవరేజీని పోల్చి చూసి ఉత్తమమైన దానిని ఎంచుకోండి.

ప్రీమియం తగ్గింపు..  

అధిక డిడక్టబుల్ (Deductible) ఎంచుకోవడం: క్లెయిమ్ వచ్చినప్పుడు మీరు కొంత మొత్తాన్ని భరిస్తానని ఒప్పుకుంటే (డిడక్టబుల్), నెలవారీ ప్రీమియం తగ్గుతుంది.

ఫ్యామిలీ ఫ్లోటర్.. 

 కుటుంబ సభ్యులందరినీ ఒకే ఫ్లోటర్ పాలసీ కింద చేర్చడం ద్వారా వ్యక్తిగత పాలసీల కంటే కొంత ఆదా చేయవచ్చు. బీమా అప్లికేషన్  ఫామ్‌లో ధూమపానం అలవాటు గురించి నిజాయితీగా ప్రకటించడం చాలా ముఖ్యం. అబద్ధం చెబితే, భవిష్యత్తులో క్లెయిమ్ పూర్తిగా తిరస్కరించే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి

Tags : health-insurance-new-rules health-insurance health-insurance-policy health-insurance-policyholders smoking-causes-eye-issues smoking smoking-and-bone-health smoking-and-copd smoke-from-factories air-pollution-due-to-cigarette-smoke non-smokers insurance-claim-rejection quit-smoking health-insurance-tips choosing-a-health-insurance-plan health-insurance-policy-checklist smoking-and-drinking
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com